Director Teja : తెలుగు హీరోయిన్లకు అవి చిన్నగా ఉంటాయి.. అందుకే ఛాన్సలు రావుః డైరెక్టర్ తేజ
NQ Staff - June 3, 2023 / 01:50 PM IST

Director Teja : టాలీవుడ్ మీద ఎప్పటినుంచో కొన్ని విమర్శలు ఉన్నాయి. అవేంటంటే.. తెలుగు అమ్మాయిలకు ఇక్కడ హీరోయిన్లుగా ఛాన్సులు రావు అని. కేవలం సైడ్ క్యారెక్టర్లు మాత్రమే ఇస్తారు తప్ప హీరోయిన్ గా ఎందుకు ఛాన్స్ ఇవ్వరు అని ఇప్పటికే చాలామంది తెలుగు అమ్మాయిలు ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
శ్రీరెడ్డి, మాధవీలత లాంటి వారు అయితే నేరుగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా దీనిపై ఇప్పటి వరకు ఏ ఒక్క డైరెక్టర్ కూడా స్పందించలేదు. కానీ తాజాగా డైరెక్టర్ తేజ దీనిప స్పందించే ప్రయత్నం చేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు ఇవ్వాలని మాకు కూడా ఉంది.
నేను కూడా ఎన్నోసార్లు నా సినిమాల్లో తెలుగు అమ్మాయిలను హీరోయిన్లుగా తీసుకోవాలని చూశాను. కానీ వారికి సహనం చాలా తక్కువ. ఆరు నెలల తర్వాత హీరోయిన్లు పాత్ర ఉంటుందని చెబితే అప్పటి వరకు ఆగరు. చుట్టు పక్కల వారు, ఇంట్లో వారు చెప్పే మాటలకు భయపడి ఎక్కడో మూలన ఉండే పాత్రలు ఇవ్వమని కోరుతారు.
కానీ హీరోయిన్ ఆఫర్ కోసం ఓపికగా ఎదురుచూడరని ఆయన అన్నారు. దాంతో తేజ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తెలుగు అమ్మాయిలు బిందు మాధవి, శ్రీ దివ్య, అంజలి లాంటి వారు తమిళంలో బాగానే ఛాన్సులు పడుతున్నారు. కానీ తెలుగులో మాత్రం అవకాశాలు రావట్లేదు.