Director Teja Fixed Not Do Film With Venkatesh Daggubati : చచ్చినా వెంకటేశ్ తో సినిమా చెయ్యను.. స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!

NQ Staff - July 24, 2023 / 12:00 PM IST

Director Teja Fixed Not Do Film With Venkatesh Daggubati : చచ్చినా వెంకటేశ్ తో సినిమా చెయ్యను.. స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!

Director Teja Fixed Not Do Film With Venkatesh Daggubati :

టాలీవుడ్ లో ఎలాంటి వివాదాలకుపోని హీరో అంటే అందరికీ టక్కున వెంకటేశ్ గుర్తుకు వస్తాడు. ఇప్పటి వరకు ఆయన క్లీన్ ఇమేజ్ తోనే సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ లో వెంకటేశ్ కు ఉన్న క్రేజ్ ఇంక ఏ హీరోకు లేదనే చెప్పుకోవాలి. అలాంటి వెంకటేశ్ సినిమాలకు హిట్, ప్లాప్ అనే సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తుంటాయి.

అందుకే అందరు డైరెక్టర్లు వెంకటేశ్ తో సినిమా చేయాలని అనుకుంటారు. కానీ ఓ డైరెక్టర్ మాత్రం చచ్చినా వెంకటేశ్ తో సినిమా చెయ్యను అంటున్నాడు. ఆయన ఎవరో కాదు స్టార్ డైరెక్టర్ తేజ. ఈయన గతంలో వెంకటేశ్ తో ఓ సినిమా చేయాలని అనుకున్నాడు. దాని పేరు సావిత్రి. కథను కూడా చెప్పాడు.

మార్పులు చేస్తుండగా..

అయితే కథలో కొన్ని మార్పులు చేసుకుని రమ్మన్నాడు వెంకటేశ్. సరే అని తేజ మార్పులు చేస్తుండగానే వెంకటేశ్ మరో డైరెక్టర్ తో సినిమా అనౌన్స్ చేశాడు. దాంతో ఆయనకు కోపం వచ్చిందంట. అప్పటి నుంచి మళ్లీ వెంకటేశ్ ను కలవలేదని తెలిపాడు తేజ. వెంకటేశ్ తో సినిమా చేయనని ఫిక్స్ అయ్యాడంట.

ఈ విషయాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో తేజ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఒకవేళ వెంకటేశ్ తో సినిమా చేయాల్సి వస్తే మాత్రం కచ్చితంగా సావిత్రి కథతోనే చేస్తానని చెబుతున్నాడు. కానీ రానా, అతని తమ్ముడు అభిరామ్ తో సినిమాలు చేశాడు. మరి భవిష్యత్ లో వెంకటేశ్ తో సినిమా చేస్తాడా లేదా అనేది చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us