రాముడి పై సినిమా మంచి నిర్ణయం : ఎస్ ఎస్ రాజమౌళి

Advertisement

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన వరుస సినిమాలతో చాల బిజీ గా ఉన్నాడు. అయితే ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఒకవైపు రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. ఆ తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తన 21వ చిత్రం చేయడానికి కూడా ప్రభాస్ అంగీకరించారు‌. ఇది ఇలా ఉంటె సడెన్ గా 22వ చిత్రం ‘ఆదిపురుష్‌’ని కూడా ప్రకటించారు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. అలాగే హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో ఈ సినిమా రాబోతుంది.

ఇప్పటికే మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు. ఇక ఈ సినిమాపై దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. ప్రభాస్ సినిమా ఆదిపురుష్ పోస్టర్ ను అందరికంటే ముందుగా చూసాను అని అన్నాడు. ప్రభాస్ కు రాముడి పాత్ర సరిగ్గా సెట్ అవుతుందని తెలిపాడు. ప్రస్తుతం అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్న సమయంలో ఈ సినిమాను తెరకెక్కించడం నిజంగా గొప్ప విషయం అని కొనియాడారు. ఇక దేశమంత కూడా రాముడి గురించి చర్చ జరుపుతున్న సమయంలో రాముడిపై సినిమా వస్తే అభిమానులు మరింత ఆనందంగా ఉంటారు అని రాజమౌళి వెల్లడించాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here