ప్లాస్మా దానం చేయడానికి భయపడవద్దు: రాజమౌళి
Admin - August 18, 2020 / 01:03 PM IST

కరోనాను జయించిన వారు ప్లాస్మాను డొనేట్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈరోజు ఇదే అంశంపై సైబరాబాద్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి హాజరయ్యారు. ప్లాస్మా దానంపై అపోహలు వద్దని, కరోనాను జయించిన వారందరూ ప్లాస్మా దానం చేయాలని రాజమౌళి తెలిపారు. కరోనా విషయంలో ఎవ్వరు నిర్లక్ష్యం వహించవద్దని, పౌష్టిక ఆహారం తీసుకుంటూ వైద్యులు చెప్పిన సలహాలు పాటిస్తే కరోనాను సులువుగా జయించవచ్చని తెలిపారు.