‘ఆచార్య’ పై వస్తున్న వివాదం పై స్పందించిన కొరటాల

Advertisement

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆచార్య. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ ను చిరంజీవి పుట్టినరోజున విడుదల చేసారు. ఇది ఇలా ఉంటె ఈ సినిమాపై పలు వివాదాలు వస్తున్నాయి. అయితే తన కథను కాపీ కొట్టి ఈ సినిమా తీస్తున్నారని యువ దర్శకుడు రాజేష్ ఆరోపణలు చేస్తున్నాడు. ఇక ఈ ఆరోపణలకు దర్శకుడు కొరటాల శివ స్పందించాడు. ఓ ఇంటర్ వ్యూ లో పాల్గొన్న ఆయన ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు.

దేవాలయ నిధులకు సంబందించిన సినిమా కాదని, అలాగే ఈ సినిమాలో తండ్రి కొడుకులు ఉండరని అన్నాడు. అలాగే ఆచార్య కథ ఇప్పటికే రిజిష్టర్ అయ్యిందని, ఈ కథను మార్చే ఛాన్స్ అస్సలు లేదని రాజేష్ బ్లేమ్ గేమ్ ఆడుతున్నాడని వివరించాడు. త్వరలో ఈ ఇష్యూని చిరంజీవి గారి దృష్టికి తీసుకుని పోతానని అన్నాడు. అవసమైతే కోర్టుకి వెళ్లి లీగల్‌గా చర్యలు తీసుకుంటాను అని కొరటాల ఆవేశంగా మాట్లాడాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here