Director Sai Rajesh Responded Controversy With Vishwak Sen : విశ్వక్ సేన్ కు సాయం చేశా.. అయినా పట్టించుకోలేదు.. సాయి రాజేష్ వివరణ..
NQ Staff - August 5, 2023 / 08:04 PM IST

Director Sai Rajesh Responded Controversy With Vishwak Sen :
డైరెక్టర్ సాయి రాజేష్ పేరు ఇప్పుడు మారుమోగి పోతుంది.. ‘బేబీ’ అనే సినిమాను తెరకెక్కించిన ఈయన మంచి విజయం అందుకున్నారు.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమా నెక్స్ట్ లెవల్లో విజయం సాధించింది.. 35 కోట్లకు పైగానే లాభాలను అందించింది..
అయితే ఈ సినిమా విషయంలో విశ్వక్ సేన్ తో డైరెక్టర్ సాయి రాజేష్ కు మధ్య ఒక వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.. ఈ విషయంపై తాజాగా డైరెక్టర్ ఫైనల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఈయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ వివాదాన్ని పొడిగించడం నాకు ఇష్టంలేదని.. నేను విశ్వక్ సేన్ ను అసలు సంప్రదించలేదని తెలిపాడు.
ఈయనను గీత ఆర్ట్స్ సంప్రదించి ఆయన ఏం చెప్పారో అది నాకు చెప్పారని.. ఆయన నో చెప్పాడని నేను బాధపడలేదు కానీ ఆయన చెప్పిన పద్ధతి బాలేదు.. అదే నాకు బాధ కలిగించింది అని తెలిపాడు.. అలాగే ఏ రోజు నేను ఒక్క మాట కూడా అనలేదు.. ఇన్సల్ట్ కూడా చేయలేదు.. కానీ ఆనంద్ గురించి చెప్పే క్రమంలోనే విశ్వక్ గురించి చెప్పాల్సి వచ్చిందని తెలిపారు..
ఆనంద్ తనను నమ్మాడని ఆయనకు కథ కూడా సరిగ్గా చెప్పలేదని అయినా నమ్మాడు అన్నాడు. ఇక విశ్వక్ కు తనకు వ్యక్తిగతంగా అయితే ఈగో లేదని ఒకసారి పార్టీకి వెళ్ళినప్పుడు కూడా పాట అదరగొట్టిందని అన్నారు.
కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను ఏదో అనడం, మీమ్స్ పేజీలను కూడా చూసి తాను ట్వీట్ వేయడం వంటివి జరిగాయని ఇలా జరగాల్సి ఉండకూడదు అని చెప్పుకొచ్చారు. వెళ్ళిపోమాకే సినిమా ఆగిపోయిన సమయంలో దిల్ రాజుకు చూపించి సినిమా రిలీజ్ చేయించానని ఈ విషయం ఇప్పటికి కూడా విశ్వక్ కు తెలియదని అన్నారు.