Director Mahi V Raghav : బూతులు మాట్లాడితే తప్పేంటి.. సైతాన్ ట్రైలర్ పై మహి వి రాఘవ్ క్లారిటీ..!
NQ Staff - June 9, 2023 / 11:35 AM IST

Director Mahi V Raghav : ఈ నడుమ సినిమాల కంటే ఓటీటీ వెబ్ సిరీస్ లకు బాగా డిమాండ్ పెరుగుతోంది. ఎందుకంటే ఓటీటీ సిరీస్ లకు సెన్సార్ ఉండదు. అక్కడ ఏం చేసినా చెల్లుతుంది. దీన్ని అడ్డుపెట్టుకుని కొందరు అడల్ట్ కంటెంట్ ఉన్న సిరీస్ లను ఎక్కువగా తీస్తున్నారు. తాజాగా వచ్చిన సైతాన్ ట్రైలర్ కూడా ఇలాంటి దుమారమే రేపుతోంది.
యాత్ర, పాఠశాల, సేవ్ ది టైగర్స్ లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ మహి వి రాఘవ్ ఇలాంటి సిరీస్ తీస్తారని బహుషా ఎవరూ ఊహించలేదు. కానీ సైతాన్ ట్రైలర్ నిండా దారుణమైన బూతులు, వయోలెన్స్ ఉన్నాయి. మితిమీరిన బూతులు ఉండటంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
సమాజం చెడిపోతుంది ఇలాంటి వాటివల్లే అంటూ తిట్టిపోస్తున్నారు. అయితే ఈ విమర్శలపై తాజాగా డైరెక్టర్ మహి వి రాఘవ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఇది పూర్తిగా క్రైమ్ సిరీస్. క్రైమ్ చేసేవారు శాంతంగా ఉండరు. బూతులే మాట్లాడుతారు. చాలా రీ సెర్చ్ చేసిన తర్వాతనే వాటిని పెట్టాం.
క్రూరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎలా మార్పు చెందాడనే కోణంలోనే ఈ సినిమాను తీశాం. ఈ సిరీస్ చూసిన తర్వాత వయలెన్స్ కు దూరంగా ఉండాలనే భావన కూడా కలిగే అవకాశం ఉంది. ఆ కోణంలోనే సిరీస్ ను తీశాం. అందులో పెద్దగా తప్పేం లేదు. రిజల్ట్ ను బట్టి వచ్చే సీజన్ లో బూతులు తగ్గించే ప్రయత్నం చేస్తాం అంటూ తెలిపాడు రాఘవ్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్మించింది. జూన్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది ఈ సిరీస్.