Prabhas New Project Update : ప్రభాస్ తో లోకేష్ కనగరాజ్ సినిమా నిజమేనా.. క్లారిటీ వచ్చేసింది..!
NQ Staff - June 25, 2023 / 09:53 AM IST

Prabhas New Project Update : ప్రభాస్ టైమ్ ఇప్పుడు అస్సలు బాగోలేదు. చేస్తున్నవన్నీ బడా ప్రాజెక్టులే. ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో తీస్తున్న సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. కానీ ఏం లాభం.. వరుసగా ప్లాపులు చవిచూస్తున్నాడు. ఆయన నమ్ముకున్న దర్శకులే ఆయన్ను నిండా ముంచేస్తున్నారు.
బాహుబలి తర్వాత ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. వరుసగా మూడు ప్లాపులు వచ్చాయి. దాంతో ఆయన ఆశలన్నీ ఇప్పుడు సలార్ మీదనే పెట్టుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ మూవీతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు మూవీ టీమ్. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. తమిళ సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రభాస్ తన తర్వాత మూవీ ఉంటుందని చెప్పాడని ఓ వార్త వైరల్ అవుతోంది. ఆయన ప్రస్తుతం తీస్తున్న లియో సినిమా తర్వాత కెరీర్ లోనే అతిపెద్ద ప్రాజెక్టును ప్రభాస్ తో చేయబోతున్నట్టు చెప్పాడంట.
ఈ వార్త విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఫులు ఖుషీ అవుతున్నారు. కానీ ఇది నిజం కాదని చెబుతోంది తమిళ మీడియా. ఆదిపురుష్ కలెక్షన్ల డ్రాప్ అవుతుండటంతో వాటి నుంచి అందరి దృష్టి మరల్చడానికి పీఆర్ టీమ్ చేస్తున్న పని అంటూ చెబుతున్నారు. వాస్తవానికి తెలుగు హీరోల విషయంలో ఎప్పుడూ తమిళ మీడియా ఇలాంటి అబద్దాలే చెబుతోంది. మరి దీనిపై పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది.