Director Lokesh Kanagaraj : పది సినిమాలే చేస్తా.. ఆ తర్వాత ఆపేస్తా.. లోకేష్ కనగరాజ్ షాకింగ్ నిర్ణయం..!
NQ Staff - June 21, 2023 / 10:18 AM IST

Director Lokesh Kanagaraj : లోకేష్ కనగరాజ్.. ఈ పేరుకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు మూడు సినిమాలే చేశాడు. అన్నీ సూపర్ హిట్టే అయ్యాయి. మొదటి సినిమా ఖైదీతోనే ఇండస్ట్రీ చూపును తనవైపుకు తిప్పుకున్నాడు. ఇక విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా హిట్టు కొట్టి కాసుల వర్షం కురిపించాడు.
దాంతో దేశ వ్యాప్తంగా లోకేష్ పేరు మార్మోగిపోతోంది. ఇక ప్రస్తుతం విజయ్ దళపతితో లియో సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడాడు. తాను పది సినిమాలే చేస్తానని షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతానని చెప్పాడు కనకరాజ్.
ఒక కథతో సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేటం చేయడం అంత ఈజీ కాదు. నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్లు, హీరోల వల్లే ఇది సాధ్యం అవుతోంది. రెండో సారి విజయ్ అన్నతో పని చేయడం సంతోషంగా ఉంది. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్వింటెన్ టరెంటినో లాగా తాను కూడా పది సినిమాలే చేస్తానని వెల్లడించాడు లోకేష్.
ఆ తర్వాత సినిమా సినిమా దర్శకత్వం ఆపేస్తానని వెల్లడించాడు. లోకేష్ యూనివర్స్ లో పది సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు విజయ్ తో సినిమా కూడా లోకేష్ యూనివర్స్ లో ఉంటుందా లేదా అని అంతా అడుగుతున్నారు. మరో మూడు నెలలు ఆగండి మీకే తెలుస్తుంది అని తెలిపాడు లోకేష్. ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం ఆయన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.