సీబీఆన్-వైఎస్ఆర్ ల జీవితాల ఆధారంగా మూవీ తీయనున్న దేవకట్ట

Advertisement

సీబీఆన్-వైఎస్ఆర్ ల జీవితాల ఆధారంగా మూవీ తీయనున్నాయని డైరెక్టర్ దేవకట్ట తెలిపారు. ఈ మూవీని గాడ్ ఫాథర్ ఆధారంగా సిద్ధం చేశానని దేవకట్ట తెలిపారు. ఈ మూవీని మూడు పార్టులుగా రాశనని తెలిపారు. అయితే ఈ మూవీ ఇంకా అధికారికంగా ప్రకటించబడక ముందే ఒక వివాదం తలెత్తింది. సీబీఆన్-వైఎస్ఆర్ జీవితాల ఆధారంగా తాను మూవీ తీయనున్నానని ఎన్టీఆర్ బయోపిక్ ప్రొడ్యూసర్ విష్ణు ఇందూరి కూడా ప్రకటించడంతో వివాదం మొదలైంది.

సీబీఆన్-వైఎస్ఆర్ జీవితాల ఆధారంగా తీయనున్న మూవీ గురించి విష్ణు తో చర్చించానని, ఇప్పుడు అతను తీయనున్న ఈ మూవీలో తాను రాసుకున్న ఫిక్షనల్ స్టోరీ గాని, సీన్స్ గాని తాను లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుందని దేవకట్ట తెలిపారు. గతంలో కూడా విష్ణు తన ఐడియాను కాపీ చేశాడని, అప్పుడు తాను పట్టించుకోలేదని, ఈసారి మాత్రం అలా జరిగితే లీగల్ గా ప్రొసీడ్ అవుతానని దేవకట్ట తెలిపారు. ఈ వ్యాఖ్యలపై విష్ణు ఇందూరి స్పందిస్తూ…దేవకట్టను ఒక రీమేక్ చేయడం కోసం మాత్రమే కలిశానని, దేవకట్ట తనకు ఎలాంటి స్టోరీ చెప్పలేదని తెలిపారు .

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here