Director Bhaskar: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టోరీని అఖిల్ కోసం రాయలేదు : బొమ్మరిల్లు భాస్కర్

Director Bhaskar: అక్కిల్ అక్కినేని, పూజా హెగ్దే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మోస్ట్ రొమాంటిక్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాని బొమ్మరిల్లు సినిమా ఫేమ్ భాస్కర్ తెరకెక్కించారు. ఈ సినిమాపై మోస్ట్ ఇంట్రెస్టింగ్ విశేషాల్ని భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ సినిమా ఇంత లేట్ అవ్వడానికి కారణం కోవిడ్ ఒకటైతే.. మరొకటి మంచి కంటెంట్ ని ప్రజంట్ చేయాలంటే ఆ మాత్రం పడుతుందని అన్నారు.

ఈ సినిమాలో అఖిల్ అక్కినేని చాలా డిఫరెంట్ గా, కొత్తగా కనిపిస్తారని అన్నారు. అఖిల్ ఇప్పటికే నటించిన సినిమాలన్నీ లవ్ స్టోరీస్. కానీ ఈ సినిమాలో మాత్రం అఖిల్ లో ఓ వినూత్నమైన శైలిని చూస్తారని డైరెక్టర్ అన్నారు. నిజానికి ఈ కథను అఖిల్ ను ఊహించి రాసింది కాదట. భాస్కర్ స్టైల్ లో ఓ బ్యాచిలర్ స్టోరీని రాసుకుని ఆ తర్వాత అఖిల్ ను సెలెక్ట్ చేయడం జరిగింది.

అఖిల్ తో పాటు హీరోయిన్ పూజా హెగ్దేని కూడా ఓ డిఫరెంట్ షేడ్ లో చూపించామని, ఇప్పటికే హీరోయిన్ కారెక్టరైజేషన్ కూడా రివీల్ చేసినప్పుడు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చిందని.. ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యిందని ఖచ్చితంగా ఈ సినిమా ప్రజల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా ఉంటుందని భాస్కర్ అన్నారు.

హీరోయిన్ గ్లామర్ తో పాటు తన డిఫెన్స్ ని కూడా ప్రజంట్ చేసేలా హ్యుమర్ అందించే స్టాండప్ కమెడియన్ రోల్ లో పూజా చాలా బాగా యాక్ట్ చేసిందని అన్నారు. డైరెక్టర్ చెప్పాలనుకున్న విషయాన్ని అఖిల్, పూజా హెగ్దేల ద్వారా ప్రేక్షకులకు చెప్పడానికి బెస్ట్ జోడీ అని.. అందుకే వీళ్ళిద్దర్ని సెలెక్ట్ చేసామని అన్నారు.

జీఎ 2 సంస్థతో భాస్కర్ తో ఎంతో అనుబంధం ఉందని, ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం కూడా బన్నీ వాసు అని అన్నారు. భాస్కర్ తన సినిమాలో ఆడియన్స్ కి ఓ కొత్త విషయాన్ని చెప్పాలని అనుకుంటానని.. అలాగే ఈ సినిమాలో కూడా ప్రేక్షకులకు ఓ కొత్త విషయం తెలుస్తుందని అన్నారు.