Prashanth Neel : ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబోలో మరో సినిమా.. ఏ జోనర్ లో రాబోతుందంటే..?
NQ Staff - April 13, 2023 / 02:11 PM IST

Prashanth Neel : ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన దర్శకులు ఇద్దరే ఇద్దరు. అందులో ఒకరు రాజమౌళి అయితే మరొకరు ప్రశాంత్ నీల్, కన్నడ డైరెక్టర్ గా పేరు గాంచిన ఈయన.. కేజీఎఫ్ సిరీస్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ భాష, ఆ భాష అనే తేడాలు లేకుండా అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని ఇప్పుడు ఎవర్ గ్రీన్ అనిపించుకున్నాడు.
అయితే ఆయన డైరెక్టర్ గా ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ సలార్. ఇప్పటికే 80శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది కూడా వెయ్యి కోట్ల మార్కును దాటుతుందనే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
అయితే ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబోలో మరో సినిమా రాబోతుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఇద్దరితో కన్ఫర్మేషన్ తీసుకున్నానని వివరించారు.
ఆ ఇద్దరి కమిట్ మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత తన మూవీ ఉంటుందని చెప్పారు దిల్ రాజు. ఇక మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని దిల్ రాజు వివరణ ఇచ్చారు. అయితే మూవీ పౌరాణిక చిత్రంగా రాబోతున్నట్టు తెలుస్తోంది. దాంతో ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ మెంట్ అవుతున్నారు.