సుశాంత్ సింగ్ రాజ్ పుట్ నటించిన “దిల్ బేచారా ” ట్రైలర్ కు 24 గంటల్లో ఎంత క్రేజ్ వచ్చిందో తెలుసా..!

Advertisement

తాజాగా బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.. తన అకాల మరణానికి ప్రేక్షకులు ఒక్కసారిగా తీవ్ర ద్రిగ్బంధి చెందారు. బాలీవుడ్ లో తనదయిన నటనతో ప్రక్షేకుల మనసును దోచుకున్నాడు సుశాంత్ సింగ్. ఇది ఇలా ఉంటె తాజాగా తాను నటించిన చివరి సినిమా “దిల్ బేచారా “.

ఈ సినిమా ట్రైలర్ ను జూన్ ఆరు తేదీన రిలీజ్ చేసారు. ఈ “దిల్ బేచారా” సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. అంతే కాదు ఇప్పటికె ఈ ట్రైలర్ ను నలబై రెండు మిలియన్ల మంది చూసారు. అలాగే ఏడు మిలియన్ల మంది లైక్ చేసారు. అంతేకాకుండా ప్రపంచం లోనే ఇరువై నాలుగు గంటల్లో యూట్యూబ్ లో అత్యధికంగా లైక్ చేసిన ట్రైలర్ గా నిలిచిపోయింది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఈ దిల్ బేచారా ట్రైలర్ కు మంచి క్రేజ్ పెరిగింది.

ఇక ఈ సినిమా స్టోరీ లోకి వెళితే… ఒక కాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అమ్మాయి మరియు సున్నితమైన వ్యక్తిత్వం గల అబ్బాయి మధ్య గల లవ్ స్టోరీ ని దర్శకుడు చక్కగా చిత్రీకరించాడు. అంతే కాదు ఈ సినిమాలో సుశాంత్ సింగ్ చెప్పిన ఓ డైలాగ్ ప్రేక్షకులను కంట తడి పెట్టనుంది. “ఎప్పుడు పుడతామో… ఎప్పుడు పోతామో… మనం నిర్ణయించుకోము కానీ ఎలా బ్రతకాలో నిర్ణయించుకోవాలి” అని చెప్పిన ఈ డైలాగ్ నిజంగా ప్రేక్షకులను కంటతడి పెట్టనుంది.

అయితే ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు ఈ చిత్ర బృందం. కానీ ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్న తరుణంలో ఓటిటి ఫ్లాట్ ఫార్మ్ ద్వారా రిలీజ్ చేయాలనీ నిర్ణయించుకున్నారు. మొత్తానికి ఈ నెల ఇరువై నాలుగు తేదీన హాట్ స్టార్ లో రిలీజ్ చేయనున్నారు ఈ దిల్ బేచారా సినిమాను. ప్రస్తుతం ఈ ట్రైలర్ రెస్పాన్స్ చూస్తుంటే తెలుస్తుంది సుశాంత్ సింగ్ ఫాన్స్ తన చివరి సినిమాను ఎంత ఆధరిస్తున్నారో… ఇక ఈ సినిమాతో సుశాంత్ సింగ్ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి దూరం అవ్వబోతున్నాడు అని అంటున్నారు సుశాంత్ సింగ్ అభిమానులు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here