Manchu Vishnu And Manoj : మరోసారి బటయ పడ్డ విష్ణు-మనోజ్ మధ్య విబేధాలు.. అన్నను పట్టించుకోని తమ్ముడు..!

NQ Staff - November 2, 2023 / 11:20 AM IST

Manchu Vishnu And Manoj : మరోసారి బటయ పడ్డ విష్ణు-మనోజ్ మధ్య విబేధాలు.. అన్నను పట్టించుకోని తమ్ముడు..!

Manchu Vishnu And Manoj :

మంచు ఫ్యామిలీ నడుమ చాలా కాలంగా విబేదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మనోజ్ మౌనికా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటి నుంచే విష్ణు సీరియస్ గా ఉన్నాడంట. అందుకే ఆ పెళ్లికి కూడా వెళ్లలేదు మంచు విష్ణు. అయితే మనోజ్ మాత్రం అప్పట్లో ఓ వీడియోను షేర్ చేయగా అది కాస్త దుమారం రేపింది. అందులో తనను కొట్టడానికి మంచు విష్ణు వస్తున్నాడంటూ మంచు మనోజ్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ వీడియో కాస్త అప్పట్లో పెద్ద సంచలనంగా మారిపోయింది. కానీ వెంటనే దాన్ని డిలీట్ చేశాడు మనోజ్. ఆ తర్వత తాము అతిపెద్ద రియాల్టీ షో చేస్తున్నామని.. అందుకే ఈ వీడియో చేశామని విష్ణు చెప్పుకొచ్చాడు.

అయితే ఇప్పటి వరకు ఆ రియాల్టీ షో మాత్రం పట్టాలెక్కలేదు. ఇదిలా ఉండగా తాజాగా మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్తకన్నప్ప షూటింగ్ లో గాయపడ్డ సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ లోని గుట్టలు, కొండల్లో ఈ షూటింగ్ ను ప్లాన్ చేశారు. అయితే అక్కడ సడెన్ గా డ్రోన్ వచ్చి మంచు విష్ణు చేతుల మీద పడింది. దాంతో అతని రెండు చేతులకు గాయాలు అయ్యాయి. అప్పటి నుంచి అతను ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు. కాగా మంచు విష్ణుకు గాయాలు కావడంపై ఇప్పటి వరకు మనోజ్ మాత్రం స్పందించలేదు. మంచు ఫ్యామిలీ మొత్తం న్యూజిలాండ్ వెళ్లినా సరే మనోజ్ మాత్రం వెళ్లలేదు.

పైగా అన్న ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంటే.. మనోజ్ మాత్రం తన భార్య మౌనికా రెడ్డితో కలిసి గ్రాండ్ ఈవెంట్ కు వెళ్లాడు. రిలయన్స్, జీయో అధినేత ముఖేష్‌ అంబానీ`జీయో వరల్డ్ ప్లాజా`ని బుధవారం ప్రారంభించారు. ఇది లగ్జరీ షాపింగ్‌ మాల్‌. సెలబ్రిటీలకు అడ్డా అయినా ముంబైలోని బాండ్రాలో దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినిమా సెలబ్రిటీలు చాలా మంది పాల్గొన్నారు. ఇక సౌత్ నుంచి మనోజ్ తన భార్య మౌనికా రెడ్డితో కలిసి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Differences Between Manchu Vishnu And Manoj Continue

Differences Between Manchu Vishnu And Manoj Continue

ఇది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. అదేంటి తన అన్న ఆస్పత్రిలో గాయాల పాలై చికిత్స తీసుకుంటుంటే మనోజ్ మాత్రం ఎంచక్కా తన భార్యతో కలిసి ఈవెంట్ కు హాజరవుతున్నాడు. అంటే వీరిద్దరి నడుమ తీవ్రమైన విబేధాలు ఉన్నాయని అనుకుంటున్నారు నెటిజన్లు.

అలాంటి గొడవలు ఉన్నాయి కాబట్టే అన్న గురంచి ఇప్పటి వరకు సోషల్ మీడియా వేదికగా కూడా మనోజ్ స్పందించలేదు. కనీసం చూడటానికి కూడా వెళ్లట్లేదు. పైగా అన్న ఆస్పత్రిలో ఇబ్బంది పడుతుంటే.. మనోజ్ మాత్రం తన భార్యను వెంటేసుకుని ఇలా ఈవెంట్లకు వెళ్తున్నాడంటే.. అప్పట్లో వీడియోలో చెప్పింది నిజమే కావచ్చు అని అంటున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us