Difference Between Sharmila And Pawan : షర్మిలకు పవన్ కు తేడా అదే.. అందుకే కాంగ్రెస్ లో విలీనం..!
NQ Staff - September 5, 2023 / 12:14 PM IST

Difference Between Sharmila And Pawan : షర్మిలకు రాజకీయాలు మాత్రమే తెలుసు. కానీ రాజకీయాల్లో వ్యాపారం చేయడం మాత్రం అస్సలు తెలియదు. అందుకే ఆమె పార్టీ పెట్టిన రెండేళ్లకే కాంగ్రెస్ లో విలీనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే జనసేన పార్టీని చూడండి. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి పదేండ్లు దాటిపోతోంది. ఇంత వరకు పవన్ కల్యాణ్ కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. కానీ రాజకీయాల్లో అగ్ర భాగంలో శాసించాలని చక్రం తిప్పుతున్నారు. ఆయన పార్టీ పెట్టిన వెంటనే పోటీ కూడా చేయలేదు. ఐదేంట్ల పాటు టీడీపీ, బీజేపీలకు మద్దతు తెలిపారు. దాంతో ఇటు ఏపీలో, అటు జాతీయ స్థాయిలో అధికారాన్ని ఎంజాయ్ చేశారు.
ఆ సమయంలో టీడీపీ, బీజేపీ సపోర్టుతో బాగానే వెనకేశారనే టాక్ ఎలాగూ ఉంది. అయితే 2019లో మళ్లీ టీడీపీని కాపాడేందుకు వ్యూహం రెడీ చేసుకున్నారు. వైసీపీ ఓట్లు చీల్చాలని వామపక్షాలు, బీఎస్పీలతో కలిసి పొత్తులు పెట్టుకున్నారు. కానీ ఏపీ ప్రజలు చాలా తెలివైన వారు కదా. అందుకే జనసేన ఆటలు సాగలేదు. అందరూ జగన్ ను నమ్మారు. జగనే తమ నేత దిక్కులు పిక్కటిల్లేలా చెప్పి మరీ ఓట్లు గుద్దేశారు. దాంతో పవన్ మళ్లీ రూటు మార్చాడు. వెంటనే జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ పంచన చేరారు. బీజేపీతో అధికారికంగా పొత్తులు పెట్టేసుకుని జాతీయ అధికార మద్దతు కూడగట్టుకున్నారు.
పోనీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ సాయంలో ఏపీలో ఏమైనా కార్యక్రమాలు చేశారా అంటే అదీ లేదు. కేవలం జగన్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అంతే కాకుండా ఇటు టీడీపీని కాపాడేందుకే ఆయన కేంద్రంలో బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారటే టాక్ ఎలాగూ ఉంది. ఇప్పుడు టీడీపీతో అనధికార పొత్తులు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో మళ్లీ బీజేపీ, టీడీపీలతో పొత్తులు పెట్టుకుని జగన్ ను టార్గెట్ చేయాలని చూస్తున్నారు.
ఇటు ఏపీలో టీడీపీని అధికారంలోకి తెచ్చి అటు కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తెస్తే ఆటో మేటిక్ గా రెండు చోట్లా తనకు పవర్ ఉంటుందనేది పవన్ ఆలోచన. అందుకే ఇప్పటి నుంచే ఆరెండు పార్టీల నడుమ సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరి షర్మిలకు ఇలాంటి రాజకీయాలు తెలియవు కదా. ఆమె ప్రజల కోసం ఏమైనా చేయాలనే ఆలోచనతో రాజకీయ పార్టీని పెట్టుకున్నారు.
తెలంగాణ అంతా పాదయాత్ర చేసి ప్రజలకు తన వాయిస్ వినిపించాయి. ఒకవేళ ఆమె పదవులు కావాలనుకుంటే అధికారంలో ఉన్న పార్టీకి దగ్గరయ్యేది. కానీ అలా చేయలేదు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోకి వెళ్తున్నారు. తన తండ్రి నడిపించిన కాంగ్రెస్ లోనే ఉండాలని ఆరాటపడుతున్నారు. అదే పవన్ కు, షర్మిలకు ఉన్న తేడా. పవన్ లాగా రాజకీయ తెలివి ఉంటే ఆమె ఎలాంటి అధికారం లేకున్నా పార్టీని నడిపించేది కాబోలు.