Punjab: మన దేశం లోని పంజాబ్ కి పాకిస్తాన్ దేశం లోని పంజాబ్ కి తేడా ఏంటి..?

Punjab: మన దేశంలోని ముఖ్యమైన రాష్ట్రాలలో ఒకటి పంజాబ్.. పంజాబ్ లో ఎక్కువగా సిక్కు మతం వారు జీవిస్తూ ఉంటారు.. వారి సాంప్రదాయాలు ఆచారాలకు తగ్గట్టుగా అక్కడి జీవన విధానం ఉంటుంది. వారి మనోభావాలకు ఎలాంటి ఆపద వచ్చిన ఊరుకునే వారు కాదు పంజాబ్ ప్రాంతం వారు.. ప్రస్తుతం దేశంలో వ్యవసాయం చట్టం గురించి జరుగుతున్న ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న వారే పంజాబీలు.. చండీగడ్ రాజధానిగా పంజాబీ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతూ దేశంలో ముఖ్య రాష్ట్రం గా ఎదిగింది..

Difference Between Pakisthan and India Punjab States : పంజాబ్
Difference Between Pakisthan and India Punjab States

అలాంటి పంజాబ్ పాకిస్తాన్లో కూడా ఒకటి ఉందని చాలా తక్కువ మందికి తెలుసు.. నిజానికి పాకిస్తాన్ లోని పంజాబ్ కి ఇండియా పంజాబ్ కి తేడా ఏంటో ఎవరికి తెలియదు.. స్వతంత్రం రాక ముందు ఈ రెండు నష్టాలు ఒకే చోట కలిసి ఉండేవి ఆ తర్వాత విడిపోయిన భారతదేశం పాకిస్తాన్ పంజాబ్ కూడా రెండుగా విడదీసింది.. మరి ఈ రెండు రాష్ట్రాల యొక్క తేడాలను పరిక్షిద్దామా..

మన దేశం లోని పంజాబ్ కంటే పాకిస్తాన్ దేశం లోని పంజాబ్ వైశాల్యంమే ఎక్కువ..పాకిస్థాన్ పంజాబ్ వైశాల్యం 2,05,344 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లు. భార‌త్ పంజాబ్ వైశాల్యం 50,362 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లు. కానీ పాకిస్తాన్ లోని పంజాబ్ యొక్క అక్షరాస్యత కంటే మనదేశపు పంజాబ్ ప్రజల యొక్క అక్షరాస్యత ఎక్కువ..అక్క‌డ అది 64.7 శాతం ఉంటే మ‌న ద‌గ్గ‌ర 75.84 శాతం ఉంది. పాకిస్తాన్ పంజాబీ జిడిపి ఎక్కువ .. మన పంజాబ్ చెందిన జిడిపి పర్ క్యాపిట ఎక్కువ.. పాకిస్తాన్ పంజాబ్ జనాభా 110 మిలియన్లు కాగా ఇండియన్ పంజాబ్ జనాభా 30 మిలియన్లు.. పాకిస్తాన్ పంజాబ్ లో నివసించే జనాభాలో 97.2 21 శాతం మంది ముస్లింలే..

Advertisement