Health Tips : మతిమరుపుతో బాధపడుతున్నారా.. ఇవి తినండి చాలు..!
NQ Staff - August 27, 2023 / 01:29 PM IST

Health Tips :
మతిమరుపు.. ఈ జనరేషన్ లో కామన్ గా వినిపించే మాట. చాలామంది దీనితో బాధపడుతున్నారు. ఐదు నిముషాల క్రితం చేసిన పని కూడా మర్చిపోతుంటారు. బైక్ కీ ఎక్కడో పెట్టేసి మర్చిపోతాన్నాం.. ఇంట్లో సరుకులు అన్నీ గుర్తుండక సగమే తెస్తున్నాం.. ఇంట్లో అమ్మ ఏదైనా తెమ్మని చెబితే అది తేకుండా మర్చిపోయి ఇంటికి వస్తున్నాం.. ఇలాంటి మాటలు కామన్ గానే వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇది కొందరిలో ఎక్కువగా ఉంటుంది. మరికొందరిలో చాలా తక్కువగా ఉంటుంది. కానీ మతిమరుపు వల్ల చాలా నష్టాలు కూడా జరుగుతుంటాయి. అయితే ఈ ఆహార పదార్థాలతో దానికి చెక్ పెట్టేయొచ్చు.
పుట్టగొడుగులు..
మతిమరుపును పోగొట్టడంలో పుట్టగొడుగులు చాలా ఉపయోగపడుతాయి. వీటిని మశ్రూమ్స్ అంటారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల మనకు మతిమరుపు సమస్య తగ్గుతుంది. వీటిని వారంలో రెండు లేదా మూడుసార్లు తీసుకోవడం వల్ల ఈజీగా మతిమరుపు తగ్గిపోతుంది.
చేపలు..
చేపలో ఆరోగ్యానికి ఎంతో మంచివి. మాంసాహారాల్లో మేటి అని చెప్పుకోవచ్చు. అయితే వీటిని తరచూ తినడం వల్ల వీటిల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాట్స్ వల్ల మనకు మతిమరుపు సమస్య తగ్గుతుంది. ఇక చేపలు గుండె సమస్యలకు కూడా ఎంతో మంచివి. కాబట్టి చేపలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.
డార్క్ చాక్లెట్..
డార్క్ చాక్లెట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది వారంలో మూడు లేదా నాలుగు సార్లు తినడం వల్ల మతిమరుపు పోతుందంట. పరీక్షల సమయంలో వీటిని తింటే మన మతిమరుపుకు చెక్ పెట్టొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి మీ ఆహారంలో ఇది కూడా చేర్చుకోండి.
గుడ్లు..
గుడ్లు ప్రతి ఒక్కరికీ ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో దాదాపు 13 రకాల ప్రొటీన్లు ఉంటాయి. కాబట్టి మన ఆహారంలో ప్రతి రోజూ గుడ్లు తీసుకోవడం ఎంతో ఉత్తమం. అల్పాహారంలో గుడ్డు తీసుకుంటే ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు పెరుగుతాయని చెబుతున్నారు. గుడ్లు మతిమరుపును పోగొట్టడంలో బాగా ఉపయోగపడుతాయి.
అవకాడో..
పండ్లలో అవకాడో కూడా చాలా ఉత్తమమైనది. దీన్ని తినడం వల్ల మెదడు చురుగ్గా పని చేస్తుంది. అంతే కాకుండా మెదడుకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో మన మెదడు ఏదీ మర్చిపోకుండా ఉంటుంది. ఇదే కాకుండా జీడిపప్పు, బాదం, వాల్ నట్స్ లాంటి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయి. వీటి వల్ల కూడా మతిమరుపు బాగానే తగ్గిపోతుంది. వీటితో పాటు రోజూ వ్యాయామం చేస్తూ ఉండాలి.