మహాత్మా గాంధీ కళ్ళజోళ్ళ విలువ ఎంతో తెలుసా..!

Advertisement

జాతి పీత మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రం తేవడం లో కీలకంగా పనిచేసిన విషయం అందరికి తెలిసిందే.. అయితే ఈ మహాత్ముడి కి సంబందించిన ఏ వస్తువు అయిన మన భారతీయులకు ఇష్టంగా భావిస్తారు. అయితే ఈ క్రమంలో గాంధీజీ వినియోగించిన బంగారు పూత పూసిన వృత్తాకారంలో ఉండే కళ్ళజోళ్ళ కొనుకోలు చేసే అవకాశం వచ్చింది. ఈ కళ్ళజోళ్ళు త్వరలో యూకే లో వేలానికి పెట్టనున్నారు.

అయితే గాంధీ జి ఈ రకమైన కళ్లజోళ్లను దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడే వాడారు. ఈ కళ్ళజోళ్ల ను గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఉపయోగించారని తెలుస్తుంది. అయితే కళ్లజోళ్లను వేలం వేశారు. ఈ క్రమంలో ఈ కళ్ళద్దాలు వేలంలో దాదాపు పదివేల పౌండ్ల ధర పలుకుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆన్ లైన్ బిడ్ లోనే ఆరు వేల పౌండ్లు పెట్టి దీని కోసం కొందరు దరఖాస్తు చేసుకున్నారు. ఒకవైపు నెటిజన్లు ఏమో.. ఇది ఎవరు అయిన తీసుకోని భారత సర్కార్ కి గిఫ్ట్ గా ఇస్తే బాగుండు అని అభిప్రాయ పడుతున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here