Actress: పుట్టిన కొడుకు ఐసీయూలో.. పుట్టెడు దుఃఖంలో ఉన్న వైల్డ్ డాగ్ బ్యూటీ!

Actress: పిల్ల‌ల‌ను వారి త‌ల్లిదండ్రులు ఎంత ప్రాణంగా చూసుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.వారికి చిన్న దెబ్బ త‌లిగినా, జ్వ‌రం వ‌చ్చినా త‌ల్లడిల్లిపోతుంటారు. ఇక పుట్టిన‌ప్ప‌టి నుండి వారి ఆరోగ్యం బాగోలేదంటే చాలా ఆవేద‌న చెందుతుంటారు. తాజాగా ఇలాంటి ప‌రిస్థితి వైల్డ్ డాగ్ బ్యూటీ దియా మీర్జాకు వ‌చ్చింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో వైభవ్ రాఖీని పెళ్లి చేసుకుంది దియా మీర్జా. పెళ్లైన నాలుగు నెలలకే పిల్లాడికి జన్మనిచ్చింది. పెళ్లికి ముందే గర్భం దాల్చిన దియా.. పెళ్లి తర్వాత నాలుగు నెలలకు అమ్మ అయింది. మే 14న ఈమెకు కొడుకు పుట్టాడు. వార‌సుడు పుట్టాడ‌నే సంతోషం దియాకు ఎక్కువ సేపు మిగ‌ల‌లేదు. పుట్టగానే కొడుకుని ఐసీయూలో ఉంచాల్సి వ‌చ్చింది. రెండు నెల‌లుగా ఐసీయూలోనే చికిత్స పొందుతున్న నేప‌థ్యంలో దియా ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది.

తమ బాబుకు అవ్యాన్ ఆజాద్ రేఖి అనే పేరు ఖరారు చేసినట్లు తెలిపింన దియా , అవ్యాన్ మే 14న జన్మించాడని.. అనుకున్న సమయం కంటే ముందుగానే జన్మించాడని తెలిపింది. అప్పటి నుంచి ఐసీయూలోనే ఉన్నాడు. ఇప్పుడతడు క్షేమంగానే ఉన్నాడు. త్వరలోనే మా ఇంట్లోకి రాబోతున్న ఈ బుడ్డోడిని ఎత్తుకునేందుకు అవ్యాన్‌ అక్కతోపాటు, అతడి నానమ్మతాతయ్యలు కూడా తెగ ఎదురు చూస్తున్నారు” అని నటి చెప్పుకొచ్చింది. తల్లైన దియా మీర్జాకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కొన్నేళ్లుగా వైభ‌వ్ రాఖీతో ప్రేమలో ఉన్న దియా మీర్జా.. 2021 ఫిబ్రవరి 15న అత‌న్ని ముంబైలో వివాహం చేసుకుంది. ఇక పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని ఆమె నిర్మోహమాటంగా చెప్పింది. గతంలో నిర్మాత సాహిల్‌ సంఘాను పెళ్లాడింది. ఐదేళ్ల ప్రయాణం తర్వాత విడాకుల ద్వారా అతడితో తెగదింపులు చేసుకుంది. తెలుగులోనూ దియాకు మంచి పేరుంది. ఈమె తెలుగమ్మాయే కావడం గమనార్హం. ఇక్కడ చివరగా నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది.