దృశ్యం సినిమా దర్శకుడు మృతి

Advertisement

బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆయన సోమవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి‌లో తుది శ్వస విడిచారు. అయితే గత కొంతకాలంగా నిషికాంత్ లివర్ సిరోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సమస్య మరింత ఎక్కువ అవ్వడంతో జూలై 31న ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. కానీ పరిస్థితి విషమంగా మారడంతో ఆయన తుది శ్వాస విడిచారు.

హీరో అజయ్ దేవగణ్ నటించిన మలయాళ చిత్రం దృశ్యంను హిందీలో రీమేక్ చేశారు నిషికాంత్ కామత్‌. అంత ముందు ఆయన మాదారీ, ముంబై మేరీ జాన్ వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి పేరును సంపాదించుకున్నాడు. ఒకవైపు నిషికాంత్‌ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని బాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర ద్రిగ్బంతి వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here