RASHMIKA: త‌నే నా ఆల్‌టైమ్ ఫేవ‌రేట్ క్రికెటర్ : ర‌ష్మిక మందాన‌

అతి త‌క్కువ స‌మ‌యంలో మంచి క్రేజ్ పొందిన అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక‌. చూడ చ‌క్క‌ని అందం గ‌ల ఈ ముద్దుగుమ్మ చ‌క్క‌ని అభిన‌యంతో తెలుగు, త‌మిళ‌, హిందీ ప్రేక్ష‌కుల మ‌న‌సులని గెలుచుకుంది. ప్ర‌స్తుతం బిజీ హీరోయిన్స్‌లో ఒక‌రైన ర‌ష్మిక తాజాగా కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంది. సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ తాను క్రికెట్‌ను పక్కా వీక్షిస్తాన‌ని చెప్పుకొచ్చింది. కరోనా వ‌ల‌న ఈ ఏడాది వాయిదా ప‌డ‌డం బాధాక‌రం. నేను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ టీమ్ అభిమానినే అయినప్పటికీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ నా ఫేవ‌రేట్ క్రికెట‌ర్ కాదు ర‌ష్మిక పేర్కొంది.

ఎంతో కూల్‌గా ఉంటూ భార‌త్‌తో పాటు చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు మంచి విజ‌యాలు అందించిన ఎంఎస్ ధోని త‌న‌కు ఫేవ‌రేట్ క్రికెట‌ర్ అంటుంది ర‌ష్మిక‌. ధోనీ బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌, కెప్టెన్సీ నాకు చాలా ఇష్టం. క్రికెట్‌లో నా ఆల్‌టైమ్ ఫేవ‌రేట్ అత‌ను. ఈ ఏడాది ఐపీఎల్ వాయిదా ప‌డ‌క‌పోతే టైటిల్‌ను ఆర్‌సీబీ గెలిచేంది. క‌రోనా వ‌ల‌న ఐపీఎల్ వాయిదా ప‌డ‌డం బాధించింది అని ర‌ష్మిక పేర్కొంది. ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప‌లో క‌థానాయిక‌గా న‌టిస్తుంది ర‌ష్మిక‌. అలానే ప‌లు త‌మిళం, హిందీ సినిమాలు కూడా చేస్తుంది.