Dhamaka Movie Trailer : రవితేజ డబుల్ ‘ధమాకా’: మాస్.. ఊర మాస్.!
NQ Staff - December 16, 2022 / 12:34 PM IST

Dhamaka Movie Trailer : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ‘ధమాకా’ సినిమా నుంచి మాస్.. ఊరమాస్ ట్రైలర్ వచ్చేసింది. ‘నేను వెనుకున్నవాళ్ళని చూసుకుని ముందుకొచ్చినవాడ్ని కాదురోయ్.. వెనక ఎవడూ లేకపోయినా ముందుకు రావొచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసినోడ్ని..’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ ఈ టీజర్ మొత్తానికే హైలైట్.
ఈ డైలాగ్ రవితేజకి సరిగ్గా సూటవుతుంది. సినీ పరిశ్రమలో ఏ అండా లేకుండా ఎదిగినోడు రవితేజ. అందుకేనేమో కావాలనే.. ఈ డైలాగ్ పెట్టినట్టున్నారు సినిమాలో.
రవితేజ.. ఒకరు కాదు, ఇద్దరు.!
ఈ సినిమాలో రవితేజ రెండు రోల్స్‌లో కనిపిస్తున్నారు. ఒకటి క్లాస్ టచ్‌తో వుంటే, ఇంకోటి మాస్ టచ్‌తో కనిపిస్తోంది. హీరోయిన్ శ్రీలీల అయితే డాన్సుల్లో ఎనర్జీ పరంగా రవితేజని మించి.. అనేలా వుంది.
యాక్షన్ బ్లాక్స్ కూడా చాలా మాస్ టచ్‌తో తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ ఆకట్టుకున్నాయి ట్రైలర్ వరకూ. త్రినాదరావు నక్కిన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
డిసెంబర్ 23న ‘ధమాకా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే బయటకు వచ్చిన సాంగ్ ప్రోమోస్ సినిమాపై అంచనాల్ని పెంచేసిన విషయం విదితమే.