మాస్క్ లేకపోతే అంతే సంగతులు : డీజీసీఏ

Advertisement

ప్రస్తుత కరోనా రోజుల్లో మాస్క్ లేకపోతే అడుగు కూడా బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాలలో తిరిగే వారికీ పోలీస్ అధికారులు జరిమానా కూడా విధిస్తున్నారు. పోలీసులు జరిమానా విధిస్తున్న సరే చాలామంది ఇప్పటివరకు కూడా మాస్కులు ధరించడం లేదు. ఇక రైళ్లు, విమానాల్లో కూడా ఇప్పటికి కొంతమంది మాస్కులు పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఇలా ఉంటె తాజాగా డిజిసిఐ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇక విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఉద్దేశ్వపూర్వకంగా మాస్క్‌ ధరించిన ప్రయాణికులకు ‘నో ఫ్లై’ లిస్ట్‌లో చేర్చుతామని తెలిపింది. అయితే విమానంలో డ్రింక్స్, ఫుడ్ తినే సమయంలో మాస్క్ పెట్టుకోకున్న పరవా లేదని తెలిపారు. ఇక ఇప్పటి నుండి ఎవరైనా మాస్క్‌లను తొలగించి తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here