Delhi Murder : ప్రియురాలిని 35 ముక్కలు చేశాడు.. 18 రోజులు ఫ్రిజ్ లో ఉంచి..!
NQ Staff - November 15, 2022 / 08:55 AM IST

Delhi Murder : దేశ రాజధాని ఢిల్లీ లో దారుణం జరిగింది. తనను నమ్మి వచ్చి సహజీవనం చేస్తున్న ప్రియురాలిని చంపేసి అత్యంత దారుణంగా వ్యవహరించాడు. ఒక కిరాతకుడు ప్రియురాలిని చంపేసి 35 ముక్కలుగా నరికి 18 రోజుల పాటు ఫ్రిడ్జ్ లో దాచి ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆ ముక్కలను పడవేస్తూ నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన అఫ్తాబ్ అమీన్ కాల్ సెంటర్ లో పని చేసే 26 ఏళ్ల శ్రద్దా వాకర్ తో పరిచయమై ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగి పెద్దలు అంగీకరించక పోవడంతో ఢిల్లీకి పారిపోయి సహజీవనం చేశారు.
ఇద్దరి మధ్య గొడవలు వస్తూ ఉండేవట. దాంతో మే 18 వ తారీఖున శ్రద్ధాను హత్య చేశాడు. మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి వాటిని ఫ్రిజ్ లో దాచాడు, అందుకు ప్రత్యేకంగా 300 లీటర్ల ఫ్రిడ్జ్ ని కొనుగోలు చేశాడట.
తర్వాత మృతదేహాన్ని 35 చోట్ల వేయాలని భావించాడు. మాంసపు ముక్కలను 18 రోజుల పాటు ఫ్రిజ్ లో ఉంచి అర్ధ రాత్రి రెండు గంటలకు వాటిల్లో కొన్నింటిని సంచుల్లో తీసుకుని ఢిల్లీ పరిధిలోని పలు ప్రాంతాల్లో విసిరేశాడు. అలా మృతదేహం మొత్తం కానరాకుండా చేశాడు.
శ్రద్ధా కొన్ని రోజులుగా తమ ఫోన్ కాల్స్ కి స్పందించక పోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో అమీన్ ను విచారించగా అసలు విషయాన్ని వెల్లడించాడు.
అతడు చెప్పిన విషయాలకు పోలీసులు సైతం నోరు వెళ్ళ బెట్టి చూస్తూ ఉండి పోయారంట. పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేయడం వల్లే తాను శ్రద్ధాను హత్య చేసినట్లుగా అమీన్ తెలియజేశాడు. మృతదేహం కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు కూడా లభించలేదని పోలీసులు పేర్కొన్నారు. అమీన్ కి కఠిన శిక్ష పడాలంటే మహిళా సంఘాల వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.