Delhi liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్: టేక్రీవాల్ రెడ్డి వైఫ్ ఆఫ్ శరత్ రెడ్డి పేరు తెరపైకి.!
NQ Staff - November 16, 2022 / 09:56 PM IST

Delhi liquor Scam : ఎవరీ కనికా రెడ్డి అలియాస్ కనికా టేక్రీవాల్ రెడ్డి.? దేశాన్ని కుదిపేస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పుడు ఈ కనికా టేక్రీవాల్ రెడ్డి పేరు ఎందుకు వినిపిస్తోంది.?
ఈ కనికా టేక్రీవాల్ రెడ్డి ఎవరో కాదు, ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన శరత్ రెడ్డి భార్యే ఈ కనికా టేక్రీవాల్ రెడ్డి. ఈమె ‘జెట్ సెట్ గో’ పేరుతో ప్రైవేటు చార్టర్డ్ విమానాలు అద్దెకు ఇచ్చే కంపెనీ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రాజకీయ నాయకులు ఎక్కువగా ఈ చార్టర్డ్ విమానాల్లో తిరుగుతుండడం గమనార్హం.
చార్టర్డ్ విమానాల్లోనే లిక్కర్ మాఫియా సొమ్ము తరలింపు.?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు, కనికా టేక్రీవాల్ రెడ్డికి సంబంధించిన ‘జెట్ సెట్ గో’ సంస్థపై కన్నేశాయి. ఈ సంస్థ నడుపుతున్న చార్టర్డ్ విమానాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి.? వాటిల్లో ఎవరెవరు ప్రయాణించారు.? అన్న విషయాలపై ఆరా తీస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు ఈ సంస్థ ద్వారా చార్టర్డ్ విమానాలు గత కొంతకాలంగా చాలా చాలా విరివిగా వాడుతున్నారు. ఆ పెద్దలతో నేరుగా కనికా టేక్రీవాల్ రెడ్డికి ప్రత్యేక సన్నిహిత సంబంధాలున్నాయని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
శరత్ చంద్రారెడ్డి మొదటి భార్య అరబిందో ఫార్మా వ్యవస్థాపకుల్లో ఒకరైన నిత్యానందరెడ్డి కుమార్తె. ఆమెకు విడాకులిచ్చి, కవితా టేక్రీవాల్‌ని పెళ్ళి చేసుకున్నారు శరత్ చంద్రారెడ్డి.