సోషల్ మీడియా వాడకం రద్దుకు అంగీకరించిన ఢిల్లీ హై కోర్టు
Admin - August 6, 2020 / 05:59 AM IST

ఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లాంటి వాటి వాడకాన్ని నిషేదించడంను ఢిల్లీ హై కోర్ట్ సమర్ధించింది. అయితే ఈ రద్దు సామాన్య ప్రజలకు కాదు. ఇండియన్ ఆర్మీలో ఉన్న సైనికులు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడకూడదని ఇండియన్ ఆర్మీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలను సవాళ్లు చేస్తూ ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ పీకే చౌదరి ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సోషల్ మీడియా వల్ల తమ కుటుంబాలకు వర్చ్యువల్ గా దగ్గరవుతున్నామని, పిల్లలకు నీతి మాటలను కూడా చెప్తున్నామని, తమకున్న నాలెడ్జ్ ను స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకుంటున్నమని చౌదరి తెలిపారు. తమ ప్రాథమిక హక్కులను కాలరాయడానికి ఎవ్వరికీ హక్కు లేదని చౌదరి పిటిషన్ లో దాఖలు చేశారు. అయితే ఈ కేసు పై విచారించిన ఢిల్లీ హై కోర్టు భద్రతా దృశ్య ఈ నిర్ణయం తీసుకోవడం సరైనదని సమర్ధించింది.