ఇంటింటికి రేషన్.. జగన్ బాటలో కేజ్రీవాల్

Admin - July 28, 2020 / 05:37 AM IST

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జగన్ బాటలో నడవనున్నాడు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఢిల్లీలో ఇంటింటికి సరుకులు పంపిణి చేసే కార్యక్రమాన్నిచేపట్టాలని నిర్ణయించుకున్నాడు.అలాగే తన ప్రభుత్వ మంత్రి వర్గంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ సరుకులను ప్రత్యేక బ్యాగుల్లో బియ్యం,గోధుమలు మరియు పంచదార నిత్యావసరాలు అన్ని కూడా కార్డు ఉన్న వారందరికీ డోర్ డెలివరీ చేయాలనీ అనుకుంటున్నాడు.అలాగే రేషన్ దుకాణాలు కూడా ఉంటాయని అన్నాడు కేజ్రీవాల్. ప్రస్తుతం ఉన్న టెండర్లు పూర్తీ చేసి ఆరు నెలల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

ఇది ఇలా ఉంటె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇంటింటికి సరుకుల డెలివరీ కార్యక్రమాన్ని చేపట్టాడు. అందులో రేషన్ బియ్యం కూడా ఇంటింటికి డెలివరీ చేస్తున్నారు. ఏపీ లో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసాడు సీఎం జగన్. ఇక రేషన్ బియ్యం డెలివరీ కోసం ప్రత్యేక కార్యాచరణ కూడా ఏర్పాటు చేసుకుంది సర్కార్.

అలాగే గోతాలు కూడా డిజైన్ చేసారు ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా ఏర్పాటు చేసారు. అయితే గోతాలు మరియు ఇతర సమస్యల కారణంగా అంతంత మాత్రానే అమలు అవుతుంది. అలాగే సెప్టెంబర్ నెల నుండి రాష్ట్రం మొత్తం హోమ్ డెలివరీ చేయాలనీ నిర్ణయించుకున్నారు.

అయితే మొదట్లో ఏపీ సర్కార్ 750 కోట్లతో సంచులను కొనాలని అనుకున్నారు. సర్కార్ ఇచ్చే అన్ని సరుకులను కూడా ప్యాకింగ్ చేసి ప్రజలకు ఇవ్వాలని అనుకుంది. వీటి నిధుల విడుదల కోసం ప్రత్యేక జీవో కూడా వచ్చింది. తర్వాత సమస్యలు వస్తాయని ఇంటి దగ్గరే వాలింటర్లు కోలిచి ఇచ్చే విధానాన్ని అమలు లోకి తేవాలని నిర్ణయం తీసుకుంది.

వీటి కోసం ప్రత్యేక వాహనాలు కూడా డిజైన్ చేయించారు సర్కార్. ఈ వాహనాల్లో సరుకులు, బియ్యం తీసుకోని నేరుగా లబ్ది దారుల దగ్గరకు వెళ్లి వాళ్ల దగ్గర ఉన్న గోతంలో పోస్తారు. వీటికోసం మొత్తం పదమూడు వేల వాహనాలను కొనుగోలు చేసారు ఏపీ సర్కార్.

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో… ప్రజలందరు కూడా ఇండ్లకే పరిమితం అవ్వాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అలాగే ఎక్కడ కూడా ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే ఏపీ సీఎం నిర్ణయం తీసుకున్న పథకాల హోమ్ డెలివరీ పద్దతిని, ఇతర రాష్టాలు కూడా ఆదర్శంగా తీసుకోని అమలు చేయాలనీ ఢిల్లీ సీఎం అన్నాడు. ఇక ఈ విషయంలో సీఎం కేజ్రీవాల్ కూడా వెంటనే నిర్ణయం తీసుకున్నాడు.

Read Today's Latest Videos in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us