CM KCR : మరి కాసేపట్లో సీఎం కేసీఆర్, కేజ్రీవాల్ ప్రెస్ మీట్..!
NQ Staff - May 27, 2023 / 02:54 PM IST

CM KCR : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేడు హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఐఏఎస్ లు, ఐపీఎస్ ల బదిలీలు, పోస్టింగ్ లపై కేంద్ర ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగానే కేసీఆర్ తో ఆయన సమావేశం అయ్యారు. ఆయనతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఇక బీజేపీకి వ్యతిరేకంగా గొంతు వినిపిస్తున్న కేసీఆర్.. ఇప్పుడు ఆప్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఇద్దరూ కలిసి మరికొద్ది సేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
ఇప్పటికే కేజ్రీవాల్ మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్ లను కలిసి మద్దతు కోరారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటే పార్టీలను ఏకతాటికి తెచ్చేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పని చేసేందుకు ముందుకు రావాలని పిలుస్తున్నారు. చూడాలి మరి ఈ ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ లో ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో.