ఐపీఎల్ : ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు షాక్..!
Admin - September 30, 2020 / 05:54 AM IST

ఐపీఎల్ 2020, నిన్న ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు మ్యాచ్ రెఫరీ 12 లక్షల రూపాయలు జరిమానా విధించారు. సన్ రైజర్స్ బ్యాటింగ్ చేసిన సమయంలో ఢిల్లీ జట్టు మినిమమ్ ఓవర్ రేట్‌ను మెయింటేన్ చేయపోవడంతో ఈ జరిమానా వేశారు.
అయితే ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.5 ప్రకారం.. ఫీల్డింగ్ జట్టు స్లో ఓవర్ రేట్ మెయిన్‌టేన్ చేయకపోతే ఈ జరిమానా విధిస్తారు. ఈ సీజన్‌లో ఇలా జరిమానా విధించడం ఇది రెండోసారి అని చెప్పాలి. మొదటగా బెంగళూరు కెప్టెన్ కొహ్లీకి 12 లక్షల రూపాయలు జరిమానా పడింది. అయితే స్లో ఓవర్ రేట్ మెయిన్ టైన్ చేస్తే మొదటి సారి 12 లక్షలు, రెండవ సారి 24 లక్షలు, మూడవ సారి లక్షల జరిమానా ఉంటుంది. ఇక నాలుగవ సారి కూడా ఈ తప్పు చేస్తే కెప్టెన్సీ నుండి తొలగిస్తారు.