Rajnath Singh : బిగ్ బ్రేకింగ్ .. రాజ్‌‌నాథ్ సింగ్‌‌కు కరోనా, ఖుష్బూకి కూడా పాజిటివ్

Rajnath Singh : దేశంలో కరోనా వ్యాప్తి విపరీతంగా ఉంది. రోజువారీ కొవిడ్​ కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. ఒమిక్రాన్ వ‌ల‌న వైర‌స్ వ్యాప్తి రెట్టింపు అవుతుంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 1,79,723 మందికి కోవిడ్ సోకినట్లు ప్రభుత్వం తెలిపింది.

Defence Minister Rajnath Singh tests Corona Positive
Defence Minister Rajnath Singh tests Corona Positive

అయితే మరణాల సంఖ్య తగ్గడం ఊరటనిచ్చే విషయం. కొత్తగా కరోనా వల్ల ఒక్కరోజు వ్యవధిలో మరో 146మంది మృతి చెందారు. 46,569 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కాగా దేశంలో కోవిడ్ రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. నేతలకు కూడా ఈ వైరస్ సోకుతోంది. తాజాగా..కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. తనను కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.

70 సంవత్సరాలున్న రాజ్ నాథ్ సింగ్..జనవరి 06వ తేదీ గురువారం ఉత్తర కాశీ రీజియన్ లో నిర్వహించిన బీజేపీ ర్యాలీలో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ లో త్వరలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…బీజేపీ అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది.

కాగా, సీనియర్ నటి శోభన (51) ఒమిక్రాన్ బారినపడింది. తాను కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నానని, ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఒమిక్రాన్ సోకిందని శోభన వెల్లడించింది. తొలిరోజు చలిజ్వరం, గొంతునొప్పి, కీళ్ల నొప్పులతో బాధపడ్డానని, ఇప్పుడా లక్షణాలు క్రమంగా తగ్గుతున్నాయని తెలిపింది. వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచించింది.

అటు, మరో సీనియర్ నటి, బీజేపీ నేత ఖుష్బూకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గత రెండు వేవ్ లలో తాను కరోనా నుంచి తప్పించుకున్నానని, ఈసారి మాత్రం కరోనా సోకిందని ఖుష్బూ వెల్లడించింది.