Deepika Padukone : ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ స్టార్స్‌ని కూడా తమ ప్రాజెక్ట్‌లో భాగం చేస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న అన్ని చిత్రాలలో చాలా మంది బాలీవుడ్ ఆర్టిస్ట్‌లు ఉంటున్నారు. ఇక ఎన్టీఆర్‌కి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ రావడంతో తర్వాత చేసే చిత్రాలు అన్ని కూడా భారీ ఎత్తున రూపొందుతున్నాయి.
ఎన్టీఆర్ 30వ సినిమాలో కథానాయికగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా జాన్వి కపూర్, కియరా అద్వానిల పేర్లు వినపడగా ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు వినపడింది. కొద్ది రోజులకి అలియా భట్ పేరు వినిపించింది. ఈ అమ్మడు పలు కారణాల వలన తప్పుకోడంతో దీపికా పదుకొణేని అప్రోచ్ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి.
అయితే దీపికా పదుకొణే కూడా ఎన్టీఆర్ 30వ సినిమాని పలు కారణాల వలన రిజెక్ట్ చేసిందని అంటున్నారు. ఇక బాలీవుడ్ భామలు ఈ ప్రాజెక్ట్‌పై పెద్దగా ఆసక్తి చూపించని ఎడల రష్మిక, పూజాహెగ్డే వంటి పాన్ ఇండియా హీరోయిన్స్‌ని తీసుకోనున్నట్టు టాక్. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ ఆల్రెడీ సూపర్ హిట్ కాగా ఇప్పుడు ఈ హిట్ కాంబోలో వస్తున్న సెకండ్ మూవీగా ఈ ప్రాజెక్ట్ క్రేజీగా వస్తుంది.ఈ సినిమాను యువ సుధ ప్రొడక్షన్స్ లో మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు.

త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీని 2023 సమ్మర్ టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారని తెలుస్తుంది. నిన్న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా చిత్ర మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఎన్టీఆర్ గంభీరమైన డైలాగ్ తో సాగిన మోషన్ పోస్టర్ వీడియో అంతకు మించిన విజువల్స్ కలిగి ఉంది. ”అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి తను ఉండకూదని… అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని… వస్తున్నా” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేది. డైలాగ్ లో కొరటాల మార్క్ స్పష్టంగా కనిపించింది.
- Advertisement -

మొత్తంగా 47 సెకెన్ల మోషన్ పోస్టర్ వీడియో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అని చెప్పాలి. ఇక అనిరుధ్ బిజీఎం సరికొత్తగా, మరో ఆకర్షణగా నిలిచింది. పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న నేపథ్యంలో నాలుగు భాషల్లో మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు. మరో రెండు నెలల్లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.