Deepika Padukone : న్యూడ్ పిక్స్ షేర్ చేస్తే తప్పేంటి.. దీపికా పదుకొణె షాకింగ్ కామెంట్లు..!
NQ Staff - June 6, 2023 / 11:29 AM IST

Deepika Padukone : దీపికా పదుకొణె ఈ నడుమ బాగానే ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆమె చేస్తున్న కామెంట్లు మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఆమె మాట్లాడే మాటలు సెక్స్, న్యూడిటీ గురించే ఎక్కువగా ఉంటున్నాయి. ఇవే ఆమె ఫ్యాన్స్ కు కూడా మండే విధంగా చేస్తున్నాయని చెప్పుకోవాలి.
దీపికా పదుకొణె ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది. అందుకే అప్పుడప్పుడు హాలీవుడ్ మీడియా సంస్థలకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తోంది ఈ బ్యూటీ. కాగా గతంలో ఆమె భర్త రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫొటోలు షేర్ చేసి సంచలనం రేపిన సంగతి అందరికీ తెలిసిందే.
వాటిపై ఏకంగా కోర్టులో కేసు కూడా నమోదైంది. కానీ దీపికా మాత్రం తన భర్తను బాగా సపోర్టు చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆమెకు మరోసారి ఈ ఫొటోలపై ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె స్పందిస్తూ.. ఒకరి ఇష్టాలను మనం సమర్ధించకపోయినా పర్వాలేదు గానీ.. వ్యతిరేకించకూడదు.
నేను కూడా అదే చేశాను. నా భర్తకు నేనెప్పుడు సపోర్టుగానే ఉంటాను. అయినా న్యూడ్ ఫొటోలు గతంలో చాలామంది పోస్టు చేశారు. అప్పుడు మౌనంగా ఉన్న వారు నా భర్త విషయంలో గొడవ చేశారు. అందులో అసలు తప్పేముంది. ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు కదా అంటూ తన భర్తకే సపోర్టు చేసింది ఈ భామ. దాంతో ఆమె మీద మరోసారి విమర్శల బాణాలతో దాడికి దిగుతున్నారు నెటిజన్లు.