రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు : దీపికా పడుకొనే
Admin - September 28, 2020 / 09:32 AM IST

బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తుంది. అయితే ఇప్పటికే ఈ కేసులో పలువురు హీరోయిన్ల పేర్లు బయటకు రావడంతో వాళ్ళను విచారించారు. తాజాగా బాలీవుడ్ నటి దీపికా పడుకునే వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీపై ఆమె ప్రశంసలు కురిపించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఓ జాతీయ మీడియా గతంలో నిర్వహించిన ఇంటర్య్వూలో రాహుల్ గాంధీ పై దీపిక పలు వ్యాఖ్యలు చేసింది.
అయితే భవిష్యత్‌లో రాహుల్ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆమె తెలిపింది. అలాగే తనకు ఇష్టమైన నేతల్లో రాహుల్ మొదటి స్థానంలో ఉంటాడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అసలైన దేశభక్తి రాహుల్‌లో కనిపిస్తుందని, యువతకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గొప్ప నాయకుడికి ఆయనే సరైన ఉదాహరణ అని ఆమె పేర్కొంది. అలాగే రాహుల్ ప్రధానమంత్రి కచ్చితంగా అవుతారనే నమ్మకం నాకు ఉందని ఆమె వెల్లడించింది.