Excise Department : న్యూ ఇయర్: తెలంగాణ ప్రభుత్వానికి లిక్కర్ ‘కిక్కు’.!
NQ Staff - January 1, 2023 / 06:55 PM IST

Excise Department : కొత్త సంవత్సర వేడుకల పుణ్యమా అని తెలంగాణ ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు వచ్చి పడ్డాయ్.. అదీ లిక్కర్ అమ్మకాల ద్వారా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? అన్న రీతిలో తెలంగాణలో మందుబాబులు లిక్కర్ తాగేశారు.
డిసెంబర్ 31వ రోజు రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు భారీగా ఆధాయం లభించింది. శనివారం ఒక్కరోజు అబ్కారీ శాఖకు 215.72 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటే, పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. గతంతో పోల్చితే అమ్మకాలు కాస్త తగ్గినా, పెరిగిన రేట్ల కారణంగా ఆదాయాన్ని ఘనంగా సాధించింది తెలంగాణ అబ్కారీ శాఖ.
2,17,444 లిక్కర్ కేసులు..
సుమారుగా 2,17,444 లిక్కర్ కేసులు, 1,28,455 బీర్ కేసులు అమ్ముడయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. విశ్వనగరం హైద్రాబాద్‌లో మందుబాబులు రెచ్చిపోయి తాగేశారు.
మరోపక్క, జిల్లాల్లోనూ మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం గణనీయంగా పెరిగింది. డిసెంబర్ 31 నేపథ్యంలో రాత్రి 1 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతినివ్వడం మందుబాబులకు భలేగా కలిసొచ్చింది.