Day – 2 బిగ్ బాస్ సీజన్ – 4 హైలెట్స్…!

Advertisement

హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ అప్ డేట్స్..
బిగ్ బాస్ హౌస్ లో డే వన్ తో పోలిస్తే డే టు చాలా చప్పగా సాగిందనే చెప్పాలి. ఎందుకంటే , హౌస్ మేట్స్ అందరూ ఇప్పుడిప్పుడే ఎవరికి వాళ్లు కాంప్రమైజ్ అవుతున్నారు.. అంతేకాదు, ఒకరిని ఒకరు కలుపుకుంటూ పోతున్నారు. ఇక ఆర్గ్యూమెంట్ చేసుకోవడానికి వారికి స్కోప్ లేకుండా పోతోంది.
ఇక హైలెట్స్ విషయానికి వస్తే.., మార్నింగ్ 8గంటలకి యాజ్ యూజ్ వల్ గా సాంగ్ కి అందరూ డ్యాన్స్ చేశారు. అంతేకాదు, సాంగ్ అవ్వగానే హౌస్ లో కట్టప్ప ఎవరు అనేది బిగ్ బాస్ ఒక కన్నువేసి ఉంచాలని హౌస్ మేట్స్ ని హెచ్చరిస్తూ పోస్టర్స్ సైతం అంటించాడు. దీంతో అందరిలో ఒక క్యూరియాసిటీ అనేది మొదలైంది. 10.30 నిమిషాలకి అందరూ కలిసి మాట్లాడుకున్నారు. కళ్యాణి టీచర్ గా బిగ్ బాస్ రూల్స్ ని ఎక్స్ ప్లైయిన్ చేస్తుంటే అందరూ కలిసి టీజ్ చేశారు. ముఖ్యంగా గంగవ్వ వేసిన కౌంటర్ హైలెట్ అనే చెప్పాలి.
సీక్రట్ రూమ్ లో ఉన్న సయ్యద్ అండ్ అరియానా ఇద్దరూ కూడా వీటిని విని ఎంజాయ్ చేశారు. 11.30 నిమిషాలకి సూర్యకిరణ్ అండ్ అమ్మరాజశేఖర్ ఇద్దరూ కూడా కాసేపు కిచెన్ లో ముచ్చట్లు పెట్టారు. ఇదే టైమ్ లో బెడ్ రూమ్ లో కళ్యాణి అండ్ లాస్య ఇద్దరూ సూర్యకిరనే కట్టప్ప అని వైల్డ్ గెస్సింగ్ చేశారు.
తర్వాత సూర్యకిరణ్ పాడిన తమిళ పాటకి హౌస్ లో అందరికీ కాస్త హుషారు వచ్చింది. ఈ లోగా ఫోన్ మోగేసరికి అఖిల్ సార్ధక్ ఫోన్ ఎత్తాడు. అరియానా మాటలకి కాసేపు కౌంటర్ వేసే ప్రయత్నం చేశాడు. చాలా సేపు ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఫుడ్ ఎందుకు పంపలేదు అని అరియానా అడిగింది. మేము పొరుగింటి వాళ్లం అని పంపాల్సిన బాధ్యత మీకు ఉందని వాళ్లు మాట్లాడుకున్నారు.
ఇదే టైమ్ లో కాన్వర్సేషన్ సాగుతుంటే నోయల్ వచ్చి ఫోన్ లో అరియానాకి క్లాస్ పీకాడు. మేము పంపము.. మీరే మా ఇంటికి వచ్చి తినండి అంటూ తన పేరు అడిగితే గూగుల్ లో సెర్చ్ చేస్కో అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో అరియానా అండ్ సయ్యద్ లకి కాసేపు ఏం చేయాలో అర్ధం కాలేదు. అలా ఫోన్ కట్ చేయకూడదు కదా అని చెప్పి అనుకున్నారు.
ఇంట్లో వాళ్లు ఫోన్ కాల్ ని చాలా లైట్ తీసుకున్నారు. తర్వాత లివింగ్ రూమ్ లో అమ్మరాజశేఖర్ సుజాతని జోక్ గా టీజ్ చేశాడు. ఇక మద్యాహ్నం భోజనాలు అయ్యాక .3.30 నిమిషాలకి బిగ్ బాస్ హౌస్ లో కట్టప్ప ఎవరో చెప్పాలి అంటూ ఒక సీక్రట్ బ్యాలట్ బాక్స్ ని ఎరేంజ్ చేశాడు. దీంతో హౌస్ మేట్స్ ఒక్కొక్కరు గెస్సింగ్ స్టార్ట్ చేసి ఓట్ వేసారు. ఇందులో విశేషం ఏంటంటే.., అఖిల్ సార్థక్ పేరు ఎక్కువమంది రాశారు. అఖిల్ కి ఐదు ఓట్లు వచ్చాయి. తర్వాత నోయల్ కి మూడు ఓట్లు వచ్చాయి. అమ్మరాజశేఖర్ కి రెండు, సూర్యకిరణ్ కి రెండు వస్తే, లాస్యకి ఒకటి మెహబూబ్ దిల్ సేకి ఒక ఓటు వచ్చింది.
దీన్ని బట్టీ చూస్తే హౌస్ మేట్స్ లో మెజారిటీ గా అఖిల్ ని కట్టప్ప అని అనుుకుంటున్నట్లుగా అర్ధం అవుతోంది. ఈ తతంగం అయిపోయిన తర్వాత సోఫా రూమ్ లో కూర్చుని అభిజిత్, మోనాల్, నోయల్ – గంగవ్వ మాట్లాడుకుంటున్నారు. ఈలోగా అభిజిత్ మీరు గంగవ్వలాగా చీర కట్టుకుంటే బాబోయ్ మేము చచ్చిపోతాం అన్నాడు. దీంతో కళ్యాణికి కోపం వచ్చింది. అభిజిత్ ని కడిగేసింది. దీంతో అభిజిత్ సారీ చెప్పాడు. కాస్త చనువుతో మాట్లాడాను సారీ అన్నాడు. తర్వాత కూడా కళ్యాణి దగ్గరకి వచ్చి కూల్ చేసి తన వైపు నుంచి క్లారిటీ ఇచ్చాడు అభిజిత్.
ఇక గంగవ్వ గార్డెన్ ఏరియాలో అఖిల్, అభిజిత్, సుజాతలోత కూర్చుని అఖిల్ పేరు ఎక్కువమంది రాశారు అని గెస్ చేసింది. అసలు అలా ఎలా చెప్పావ్ అంటూ సుజాత అడిగితే నాకు అనిపించింది అని అంది గంగవ్వ పర్పెక్ట్ గానే గెస్ చేసింది. ఇక సాయంత్రం 6.30 నుంచి మోనాల్ కిచెన్ లో హడావుడి చేసింది. అమ్మరాజశేఖర్ కి, సూర్యకిరణ్ కి ఆమ్లెట్ వేసిన పాన్ లో చపాతీ కాల్చొద్దు ప్లీజ్ అని రిక్వైస్ట్ చేసింది. ఇక్కడే ఇదే విషయాన్ని దేవి, లాస్యలతో కూడా డిస్కస్ చేశానని వాళ్లు మిస్ అండర్ స్టాండ్ చేస్కున్నారని చెప్పి వాపోయింది. అంతేకాదు, చాలా సేపు ఎమోషనల్ గా ఫీల్ అయ్యింది అమ్మరాజశేఖర్ ని పట్టుకుని, కళ్యాణిని, సుజాతని పట్టుకుని బాగా ఏడ్చింది. సుజాత అండ్ కళ్యాణి ఇద్దరూ కూడా మోనాల్ ని ఓదార్చే ప్రయత్నం చేశారు.
రాత్రి 7.15 నిమిషాలకి చిత్రం ఎవరిది… అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆరు జంటలుగా విడిపోమని కమ్యూనికేషన్ తో పెయింటింగ్ వేయాలని చెప్పాడు. దీనికి సంచాలకులుగా దేవిని పెడితే ఫైండర్ గా అమ్మరాజేశేఖర్ ని పెట్టాడు. టీమ్ కరెక్ట్ గా ఆడితే 14000 పాయింట్స్ గెలుచుకుని లగ్జరీ బడ్డెట్ పొందచ్చని చెప్పాడు. అంతేకాదు, గేమ్ ఆడేటపుడు కట్టప్ప ఎవరో గెస్ చేయాలని, వారితో జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించాడు బిగ్ బాస్. ఇక టీమ్స్ గా విడిపోయిన వారు పెంయింటింగ్ వేయడం స్టార్ట్ చేశారు. గంగవ్వ – సుజాత, సూర్యకిరణ్ – మెహబుబ్, నోయల్ – అభిజిత్ , కళ్యాణి – మోనాల్ , లాస్య – అఖిల్ లు పెయింటింగ్ వేసారు. దేవి జడ్జిగా ఉంది. పెయిటింగ్ వర్క్ పూర్తి అయ్యేసరికి రాత్రి 9గంటలు దాటింది. 9.30 నిమిషాలకి సీక్రట్ రూమ్ లో సయ్యద్ అండ్ అరియానా ఇద్దరిని మీకు అడిగిన ఫుడ్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఇంట్లోకి వెళ్లాలి అని, హౌస్ మేట్స్ ఎందుకు పంపలేదో తేల్చుకోవాలని బిగ్ బాస్ ఆదేశించాడు.
రాత్రి 10.30 నిమిషాలకి అమ్మరాజశేఖర్ వచ్చి పెయిటింగ్స్ ఎవరు ఎవరు వేసారు దాన్ని మ్యాచ్ చేసే ప్రయత్నం చేసాడు. గంగవ్వ కూడా గార్డె్న్ ఏరియాకి వచ్చి అమ్మరాజశేఖర్ తో కాసేపు మాట్లాడింది.
ఇక రాత్రి 11గంటలకి లగ్జరీ బడ్జెట్ పాయింట్స్ కేవలం 5వేలు మాత్రమే వచ్చాయని బిగ్ బాస్ ఎనౌన్స్ చేశాడు. హౌస్ మేట్స్ డిస్సపాయింటింగ్ లో ఉండగా…, రాత్రి 12 అమ్మరాజశేఖర్ అఖిల్ కూర్చుని ఉండగా.. సీక్రట్ రూమ్ నుంచి అరియానా – సయ్యద్ లు ఇద్దరూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రావడం రావడమే హౌస్ మేట్స్ పై విరుచుకుపడ్డారు..
దీంతో అక్కడ రేపటి ఎపిసోడ్ లో చిన్నసైజ్ యుద్ధవాతావరణమే కనిపించబోంది. మరి చూద్దాం.. రేపటి ఎపిసోడ్ లో ఏంజరగబోతోంది అనేది…

Written By : Paritala Murthy

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here