Day-1 బిగ్ బాస్ సీజన్ – 4 రివ్యూ..!

Advertisement

హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రివ్యూ స్పెషల్…
మొదటి రోజు బిగ్ బాస్ హౌస్ లో మజా వచ్చింది. మనం ఫటా ఫట్ హైలెట్స్ చూసినట్లయితే…,
మార్నింగ్ 8 గంటలకి అందరూ నిద్రలేచి చాలా హుషారుగా డ్యాన్స్ చేశారు. గంగవ్వ కూడా పిడకల స్టెప్పు వేసి పిండేసింది. ఇక మోనాల్ గజ్జర్, దేత్తడి హారిక, లాస్య , మెహబూబ్ ఇలా అందరూ హుషారుగానే కనిపించారు. సూర్యకిరణ్ అందరితో కాసేపు చేతులతో ఎక్సర్ సైజులు చేయించాడు. సీక్రట్ రూమ్ లో ఉన్న అరియానా, సయ్యద్ లు కూడా ఎక్సర్ సైజులు చేశారు. సయ్యద్ సోహైల్ అయితే అరియానాని వీపు పై ఎక్కించుకుని పుష్ అప్స్ కొట్టాడు.


9 గంటలకి కిచెన్ లో హడావుడి స్టార్ట్ అయ్యింది. అమ్మరాజశేకర్ కరాటే కళ్యాణి వస్తే ఎలకలు అన్నీ పారిపోతాయి.. ఎందుకంటే ఆమె క్యాట్ వాక్ చేస్తుంది కదా అంటూ జోక్ వేసాడు. అందరూ సరదాగా ఉన్న సమయంలో 10.45నిమిషాలకి పోస్ట్ బాక్స్ మోగింది. ఏదో టాస్క్ వచ్చిందని అందరూ హుషారుగా గేదర్ అయ్యారు. లాస్య మోనాల్ వాష్ రూమ్ కి వెళ్తుంటే త్వరగా వచ్చేయమని చెప్పింది. దీంతో అందరూ గేదర్ అయిన తర్వాత వచ్చిన పోస్ట్ ని ఓపెన్ చేశారు. మార్నింగ్ మస్తీలో అందరూ కంపల్సరీగా పార్టిసిపేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. అంతేకాదు, బౌల్ లో ఉన్న చిట్టీలని తీసి కోరిన వారికి ఇచ్చి అందులో ఏముందో వారిని ఆన్సర్ చేయమని చెప్పాడు బిగ్ బాస్.


దీంతో గేమ్ మొదలైంది. అమ్మరాజశేఖర్ – సూర్యకిరణ్ ఇద్దరూ కూడా ఆన్సర్ ఇచ్చారు. తర్వాత గంగవ్వ ఏ వయసులో ఉండిపోవాలని ఉంది అంటే దేవుడు నాకు ఈ వయసులోనే ఇంతటి ఫేమ్ ఇచ్చాడు కాబట్టి ఇదే వయసులో ఉండిపోతా అంది. తర్వాత మోనాల్ ని విలేజ్ గురించి మాట్లాడమని చెప్పారు. తను వాళ్ల నాన్నని గుర్తు చేస్కుని మరోసారి ఎమోషనల్ అయ్యింది. సూర్య కిరణ్ ఇక్కడే తనని విలేజ్ గురించి చెప్పమని, ఫ్యామిలీ గురించి కాదని ప్రశ్న ఏది ఉందో అదే సూటిగా ఆన్సర్ చేయమని చెప్పాడు. కాసేపు మోనాల్ ఫీల్ అయ్యింది. అభిజిత్ కి సూర్యకిరణ్ కి ఇక్కడ చిన్న క్లాష్ అయ్యింది. మిగతా హౌస్ మేట్స్ లో కొందరు మోనాల్ ని ఓదార్చే ప్రయత్నం చేశారు. తేరుకున్న మోనాల్ విలేజ్ గురించి చెప్పి తన స్టోరీని ఫినిష్ చేసింది.
అఖిల్ సార్ధక్ తనకి బల్లి అంటే భయం అని చెప్తే.. మెహబుబ్ ఒక్కరోజులో చనిపోతావ్ అని తెలిస్తే ఏం చేస్తావ్ అంటే తన పేరెంట్స్ ని బాగా మిస్ అయ్యానని వాళ్లతో గడుపుతానని చెప్తూ ఎమోషనల్ అయిపోయాడు. మోనాల్ ఇదే మూడ్ లో ఉంటే దివి – సుజాత నార్మల్ చేశారు. గంగవ్వతో కాసేపు అఖిల్ అండ్ దేవి ఇద్దరూ గార్డెన్ ఏరియాలో టైమ్ స్పెండ్ చేశారు. మెహాబూబ్ దిల్ సే ని కరాటే కళ్యాణి ఓదార్చింది. కాసేపు ఈ ఓదార్పు యాత్ర అయ్యాక, సూర్యకిరణ్, అఖిల్, నోయల్ ముగ్గురూ వాష్ రూమ్ లో మాట్లాడుకున్నారు. సూర్యకిరణ్ ఇక్కడే ఒక మాట అన్నాడు అందరూ బాగా ప్రిపేర్ అయ్యి వస్తారు అని.. లైట్ తీస్కోవాలన్నాడు.

ఇక మద్యాహ్నం 1.30నిమిషాలకి ఇంట్లో ఫోన్ మోగింది. సుజాత వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసింది. సీక్రట్ రూమ్ లో ఉన్న సయ్యద్ సోహైల్ బిగ్ బాస్ లాగా మాట్లాడి ఫుడ్ ఆర్డర్ చేశాడు. తనతో పాటు ఉన్న అరియానా గ్లోరికి కూడా కలిపి ఫుడ్ చెప్పాడు. ఇక్కడే కాస్త గందరగోళం ఏర్పడింది. సుజాత లిస్ట్ చెప్తుంటే అందరూ బిగ్ బాస్ కాదని ఎవరో మాట్లాడారని అనుమానం పడ్డారు. కరాటే కళ్యాణి కిచెన్ లో వంట చేస్తుంటే లాస్య సపోర్ట్ చేసింది. నోయల్ బిగ్ బాస్ కాదని ఎవరో ఈ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారని గెస్ చేశాడు. బిగ్ బాస్ ఎప్పుడూ ఇలా ఫుడ్ ఇవ్వమని అడగడు కదా అంటూ అనుమానపడ్డాడు. దీంతో సుజాతకి – కరాటే కళ్యాణికి మాటల యుద్ధం మొదలైంది. సుజాత కళ్యాణి అన్న మాటలకి హర్ట్ అయ్యింది. అసలు నేను ఏమీ అనకుండా ఎందుకు హర్ట్ అయ్యిందని కళ్యాణి ప్రశ్నించింది. చిన్నపాటి ఆర్గుమెంట్ ఇక్కడ చోటు చేస్కుంది. ఈ నిప్పు మెల్లగా సెగ అంటుకుంటున్న టైమ్ లో సరిగ్గా సాయంత్రం 6గంటలకి బిగ్ బాస్ నామినేషన్స్ ప్రక్రియని స్టార్ట్ చేశాడు.
అనుకున్నట్లుగానే హౌస్ లో ఉన్నవారిని 7 జంటలుగా విడగొట్టి కుటుంబ సభ్యులందరూ ఏకాభిప్రాయంతో ఒకరిని సేఫ్ చేయాలని, ఇంకొకరిని నామినేట్ చేయాలని చెప్పాడు. ఇక్కడ్నుంచి అసలు డ్రామా స్టార్ట్ అయ్యింది.
అభిజిత్ – దేత్తడి హారిక ఇద్దరిలో అభిజిత్ ని నామినేట్ చేశారు… దేత్తడి హారికని సేఫ్ చేశారు ఇంటి సభ్యులు. అలాగే, దేవి నాగవల్లి సూర్యకిరణ్ ఇద్దరిలో సూర్యకిరణ్ ని నామినేట్ చేశారు… దేవి నాగవల్లిని సేఫ్ చేశారు.
కరాటే కళ్యాణి అండ్ అఖిల్ సార్థక్ ఇద్దరిలో కరాటే కళ్యాణి సేఫ్ అయితే, అఖిల్ సార్ధక్ నామినేట్ అయ్యాడు.
దివి అమ్మరాజశేఖర్ ఇద్దరిలో దివి నామినేట్ అయ్యింది. మెహబూబ్ దిల్ సే లాస్య ఇద్దరిలో మెహబూబ్ నామినేట్ అయ్యాడు. మోనాల్ – సూజాత ఇద్దరిలో మోనాల్ ని సేఫ్ చేశారు. సుజాతని నామినేట్ చేసారు ఇంటిసభ్యులు.
ఫైనల్ గా గంగవ్వ – నోయల్ ఇద్దరిలో గంగవ్వని ఎక్కువ మంది ఇంటిసభ్యులు నామినేట్ చేశారు. నోయల్ సేఫ్ అయ్యాడు.
ఇలా ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియలో మొత్తం ఏడుగురు నామినేషన్స్ లోకి వచ్చారు. ఈ ప్రక్రియలోనే సుజాత అండ్ కరాటే కళ్యాణిలకి మళ్లీ వాగ్వివాదం అయ్యింది. సుజాత చెప్పింది వినాలి ఇని అంటుంటే కరాటే కళ్యాణి కూడా నువ్వు మిస్ అండ్ స్టాండ్ చేస్కున్నావ్ అంటూ జరిగిన విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. ఇద్దరూ కాసేపు సోపాలో కూర్చుని లాస్యని జడ్జిగా పెట్టి వారిద్దరి మద్యన ఉన్న షేడ్ ని చెరిపేద్దాం అనుకున్నారు. కానీ కరాటే కళ్యాణి బాగా ఎమోషనల్ అయిపోయింది. నాది తప్పులేదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఫీల్ అయ్యింది. లాస్య కాసేపు కళ్యాణిని ఓదార్చి కిచెన్ లోకి పంపింది.
రాత్రి 11.45 నిమిషాలకి మళ్లీ పోస్ట్ బాక్స్ లో నుంచి లెటర్ వచ్చింది. ఈ సారి ఇందులో చందమామ లాంటి హౌస్ లో ఒఖ మచ్చలాగా మీలోనే ఒక కట్టప్ప ఉన్నాడు జాగ్రత్త అంటూ బిగ్ బాస్ హెచ్చరికలు పంపాడు. ఆ కట్టప్ప ఎవరో ఏంటో అని హౌస్ మేట్స్ కాసేపు ఫన్ చేశారు.
ఇక రేపటి ఎపిసోడ్ రసవత్తరంగా సాగనుంది. ఒక బిగ్ టాస్క్ జరగబోతున్నట్లుగా ప్రోమోని కట్ చేశారు. మొత్తానికి ఫస్ట్ డేనే హౌస్ లో కాసేపు ఓదార్పు యాత్రలు, కాసేపు ఎమోషనల్ వార్, కాసేపు గేమ్ , కాసేపు నామినేషన్స్ తో మోత మోగిపోయింది. మరి రెండో రోజు ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరం.

Written By : Paritala Murthy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here