David Warner : పంత్ యాక్సిడెంట్ తో ఢిల్లీ క్యాపిటల్స్ కి కొత్త కెప్టెన్
NQ Staff - January 1, 2023 / 08:00 PM IST

David Warner : టీం ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదినికి గురై తీవ్ర గాయాల పాలైన విషయం తెల్సిందే. పంత్ కోలుకోవడానికి ఆరు నెలల సమయం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. మరో ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారట.
దాంతో ఈ ఏడాది మొత్తం కూడా రిషబ్ పంత్ క్రికెట్ ఆడే అవకాశాలు లేవు అంటూ సమాచారం అందుతోంది. రిషబ్ ప్రస్తుతం ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
యాక్సిడెంట్ తో ఐపీఎల్ దూరంగా ఉండాల్సిన పరిస్థితి. దాంతో పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్ ని ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క కొత్త కెప్టెన్ గా నియమిస్తూ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయనకు వరుసగా శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉందని వైద్యులు పేర్కొన్నారు. పంత్ త్వరగా కోలుకోవాలని క్రికెటర్ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఆయన తిరిగి మైదానంలో అడుగు పెట్టాలని ఎంతో మంది ఆశిస్తున్నారు.