David Warner : కార‌ణం లేకుండా స‌న్ రైజ‌ర్స్ తొల‌గించ‌డం బాధ‌గా ఉంద‌న్న వార్న‌ర్

David Warner : టీ 20 వరల్డ్ కప్ 2021లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ని గెలుచుకున్న డేవిడ్ వార్నర్ ప్రస్తుతం ప‌లు ఛానెల్స్‌కి ఇంట‌ర్వ్యూలు ఇస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అయితే స‌న్‌రైజ‌ర్స్ స‌డెన్‌గా తొల‌గించ‌డంపై చాలా బాధ‌గా ఉంద‌ని వార్న‌ర్ అన్నాడు. హైద‌రాబాధ్‌లో నాకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు. వారి కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాను. ఏ కార‌ణం లేకుండా తీసేయ‌డం బాధ‌గా అనిపించింది అని వార్నర్ పేర్కొన్నాడు.

TheNewsQube-
David Warner about IPL and SRH
David Warner about IPL and SRH

న‌న్ను తొల‌గించ‌డానికి కార‌ణం ఏదైన కావోచ్చు కాని ఫ్రాంచైజీ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాను. నెట్స్ లో కూడా బాగా క‌ష్ట‌ప‌డ్డాను. స‌మ‌యానికి ఆడ‌లేక‌పోయినందుకు తీసేయ‌డం బాధ‌గా ఉంద‌న్నాడు వార్న‌ర్. కాగా, ఐపీఎల్‌లో పేలవమైన ఫామ్ కారణంగా నెటిజన్లు డేవిడ్‌ వార్నర్‌ని నిరంతరం ట్రోల్ చేశారు. అయితే ఈ ఆటగాడుటీ 20 ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అందరి నోళ్లు మూయించాడు.

David Warner about IPL and SRH
David Warner about IPL and SRH

ఆస్ట్రేలియాని ప్రపంచ ఛాంపియన్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై వార్నర్ అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించాడు. రెండో వికెట్‌కు మిచెల్ మార్ష్‌తో కలిసి 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వార్నర్ ఈ ప్రదర్శన చూసిన తర్వాత నెటిజన్లు ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ట్రోల్ చేస్తున్నారు.

నిజానికి డేవిడ్ వార్నర్‌ని ఐపీఎల్ 2021 సమయంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ నుంచి తొలగించింది. కొన్ని మ్యాచ్‌లలో ఈ ఆటగాడిని ప్లేయింగ్ XI నుంచి కూడా దూరంగా ఉంచారు. అయితే ఈ విషయంపై ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్ బ్రాడ్ హాడిన్ షాకింగ్ విషయాన్ని బహిర్గతం చేశాడు.

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఎదురైన చేదు అనుభవం కారణంగా వచ్చే సీజన్‌‌లో కొత్త జట్టు తరుపున ఆడతానని ప్రకటించాడు డేవిడ్ వార్నర్. నిలకడైన ప్రదర్శన ఇచ్చే వార్నర్ భాయ్ కోసం చాలా జట్లే పోటీ పడుతున్నాయి.