ఏడవ నిజాం కూతురు బషీరున్నిసా బేగం కన్నుమూత
Admin - July 29, 2020 / 06:55 AM IST

ఒకప్పుడు హైదరాబాద్ నగరాన్ని పాలించిన ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సంతానంలో బ్రతికున్న ఏకైక వ్యక్తి, ఆయన కుమార్తె బషీరున్నిసా బేగం(93) కన్నుమూసింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతుంది. ఆమె ఆరోగ్యం మరింత క్షిణించడంతో ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచింది. బషీరున్నిసా బేగం 1927 సంవత్సరంలో జన్మించారు. ఆమెకు అలీ పాషాగా పేరొందిన నావాబ్ కాసిం యార్ జంగ్‌తో పెళ్లి జరిగింది.
వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. కుమార్తె పేరు రషీదున్నిసా బేగం. పురాణీ హవేలీలో నివసిస్తున్నారు. అలీ పాషా 1998 సంవత్సరంలో మరణించారు. బషీరున్నిసా బేగం మరణం పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సానుభూతిని వ్యక్తం చేశారు. ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ప్రార్థనల అనంతరం అంత్యక్రియలను నిర్వహించనున్నారు. పాతబస్తీలోని దర్గా యాహియా పాషా స్మశానవాటికలో బషీరున్నిసా బేగం అంత్యక్రియలు జరుపనున్నారు.