Dasara Movie : ఒక్క మూవీగానే రానున్న నాని దసరా. రెండు పార్టులనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే ఇక.

NQ Staff - January 28, 2023 / 04:25 PM IST

Dasara Movie : ఒక్క మూవీగానే రానున్న నాని దసరా. రెండు పార్టులనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే ఇక.

Dasara Movie : న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న దసరా మూవీ అనౌన్సయిన నాటి నుంచే ఆడియెన్సులో హైప్ చేసింది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని, కీర్తిసురేష్ జంటగా నటిస్తున్న ఈ ప్యాన్ ఇండియా చిత్రం మార్చి 30 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. అయితే నాని ఫస్ట్ టైమ్ ఓ పెద్ద సినిమా అయిన ప్యాన్ ఇండియా ప్రాజెక్టులో నటించడం, పీరియాడికల్ మూవీ కావడం, రస్టిక్ వైబ్స్ కనిపించడంతో ఈ మూవీ రెండు పార్టులుగా రానుందన్న టాక్ జోరుగా వినిపించింది.

ఇలాంటి గాసిప్ రావడానికి కూడా బలమైన కారణాలు లేకపోలేదు. పుష్ప మూవీ ఇలాగే పీరియాడికల్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం, అందులోనూ రగ్డ్ లుక్స్ తో బన్నీ కనిపించడంతో దసరా కూడా రెండు భాగాలుగా బాక్సాఫీసుకి ఎంట్రీ ఇవ్వనుందని అనుకున్నారంతా. దాంతో ఈ సీక్వెల్ పుకార్లు ఇంకాస్త ఊపందుకుని సోషల్మీడియాలో హల్చల్ చేశాయి. మరోవైపు పుష్పతో పాటు బాహుబలి, కేజీఎఫ్ లాంటి బడా సినిమాలు కూడా రెండు పార్టులుగానే రిలీజై వసూళ్ల వర్షం కురిపించాయి. పార్ట్ వన్ కి పాజిటివ్ టాక్ వస్తే, ఇక పార్ట్ టూకి భారీగా బజ్ క్రియేటవడంతో పాటు, ఓపెనింగ్స్ వసూళ్లు, మార్కెటింగ్ కూడా బాగా వర్కవుటవుతుందనేది ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీల్లోనూ నడుస్తున్న బిజినెస్ స్ట్రాటెజీ.

Dasara Movie Going Release On March 30

Dasara Movie Going Release On March 30

దసరా మూవీకి కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతూ పార్ట్ వన్ తో బంపర్ హిట్ కొట్టి, పార్ట్ టూ తోనూ సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తారని ఊహించారంతా. కానీ లేటెస్ట్ అప్ డేట్స్ ప్రకారం ఈ మూవీ రెండు భాగాలుగా రావడం లేదని, కేవలం ఒక సినిమాగానే విడుదలవుతుందని సమాచారం. నిజానికి రెండు పార్టుల ఫార్ములా బిజినెస్ పరంగా కలిసొచ్చినా కథ, కంటెంట్, క్యారెక్టర్స్ అన్నీ బలంగా కుదిరి సీక్వెల్ కి సరిపడా ఎలిమెంట్స్ ఉంటే తప్ప ప్రాపర్ గా వర్కవుటవ్వదు. బజ్ ఉంది కదా అని తీసుకుంటూ పోతే రిజల్ట్ కచ్చితంగా తేడా కొట్టే ప్రమాదమూ లేకపోలేదు.

ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకునే స్టోరీకి తగ్గట్టుగా సింగిల్ ప్రాజెక్ట్ గానే దసరా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. నాని కూడా ఈ మూవీ కోసం మెయింటెయిన్ చేసిన హెయిర్ స్టయిల్ అండ్ లుక్స్ నుంచి బైటికొచ్చేసి తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టేశాడు కాబట్టి.. ఇక దసరా సీక్వెల్ కి నో ఛాన్స్ అనేది కన్ఫామే. మరిక ఈ అప్ కమింగ్ ప్యాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి టాక్ దక్కించుకోనుందో మార్చి 30న చూడాల్సిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us