Star Heroine : ఈ ఫొటోలో చిన్నారి ఇప్పుడో స్టార్ హీరోయిన్.. చేసిన వన్నీ సూపర్ హిట్లే..!
NQ Staff - June 12, 2023 / 11:11 AM IST

Star Heroine : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది సెలబ్రిటీల చిన్నప్పటి ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. వాటిని వారి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసి ఎవరో గుర్తుపట్టండి అంటూ ఫజిల్ గేమ్ కూడా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ఫొటో కూడా వైరల్ అవుతోంది.
పైన మీకు కనిపిస్తున్న ఫొటోల్లో ఉన్నది ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్. పైగా ఆమె నటించిన సినిమాలు అన్నీ సూపర్ హిట్లే. పైగా కుర్రాళ్లకు కలల రాకుమారిగా మారిపోయింది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ సంయుక్తా మీనన్. ఈ చేపకండ్ల సుందరి ఇప్పుడు తెలుగులో వరుసగా సినిమాల్లో నటిస్తోంది.
కాగా సంయుక్త రీసెంట్ గానే సార్, విరూపాక్ష సినిమాలతో రికార్డులు సృష్టించింది. ఈ రెండు సినిమాల్లో ఆమె నటనకు అంతా ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఆమె హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. హిట్ కావాలంటే కచ్చితంగా సంయుక్తా ఉండాల్సిందే అన్నట్టు పేరు తెచ్చుకుంది ఈ భామ.

Cute Baby Now Emerging As Star Heroine
అందుకే సంయుక్తా కు వరసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం నాలుగు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయంట. అందానికి అందం, అభినయం రెండు ఉండటంతో పాటు అదృష్టం కూడా ఆమెకు కలిసి వచ్చింది. అందుకే ఫుల్ జోష్ లో ఉంది ఈ భామ.