Currency notes: క‌రెన్సీ నోట్ల‌పై క‌నిపించే గీతల వెనుక క‌హానీ ఏంటో తెలుసా?

Currency notes: కొద్ది సంవ‌త్స‌రాల క్రితం మ‌నదేశంలో కొత్త నోట్ల‌ను ఆర్బీఐ రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. వీటి భద్రతా విషయాలను దృష్టిలో పెట్టుకుని నోటుపై చిన్న చిన్న గుర్తులను వేస్తుంది. ఈ ప్రక్రియ ఫేక్ కరెన్సీకి అడ్డుకట్ట వేయడానికి ఉపయోగపడుతుందని వారు చెబుతుంటారు. మరి మీరెప్పుడైనా రూ. 100, రూ. 200, రూ. 500, రూ. 2000 నోట్లపై నల్లటి గీతలను చూశారా. వాటి వెన‌క ఓ కారణం ఉంద‌నే సంగతి తెలుసా?

currency notes have oblique lines2
currency notes have oblique lines2

నోట్లపై కనిపించే ఈ గీతలను బ్లీడ్ మార్క్స్ అంటారు. ఈ బ్లీడ్ మార్కులను దృష్టి లోపం ఉన్నవారి కోసం ప్రత్యేకంగా రూపొందిస్తారు. నోటుపై ఉన్న ఈ లైన్లను టచ్ చేసి.. అది ఎన్ని రూపాయల నోటు అనేది చెప్పొచ్చు. రూ. 100, 200, 500, 2000 నోట్లపై ఈ గుర్తులు కనిపిస్తాయి. ఈ గీతలు వాటి విలువను తెలియజేస్తాయి.

రూ. 100 నోటుపై రెండు వైపులా నాలుగు లైన్లు(|| ||) ఉంటాయి. అలాగే రూ. 200 నోటుకు రెండు వైపులా నాలుగు లైన్లు, రెండు సున్నాలు(|| o o||) ఉంటాయి. అదే సమయంలో రూ. 500 నోట్లపై ఐదు గీతలు(|| | ||), రూ.2000 నోటుపై రెండు వైపులా 7 గీతలు(| || | || |) ఉంటాయి. ఈ గీతల సహాయంతోనే అంధులకు ఆ కరెన్సీ నోటు విలువ ఎంతో అర్ధమవుతుంది.

మరోవైపు రూ. 2000 నోటు వెనుక భాగంలో మంగళయాన్ ఫోటో ముద్రించబడి ఉంటుంది. రూ.500 నోటుపై ఎర్రకోట చిత్రాన్ని ముద్రించారు. అలాగే రూ. 200 నోటు వెనుక భాగంలో సాంచి స్థూపం ఉంటుంది. ఇక రూ.100 నోటుపై ‘రాణి కి వావ్’ చిత్రం ఉంటుంది. దీనిని UNESCO 2014 సంవత్సరంలో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది.

Nepal writes to RBI to declare banned new Indian currency notes legal - The  Economic Times

భారతదేశానికి చెందిన మార్స్ మిషన్‌లో భాగం. రూ.500 నోటులో ఎర్రకోట చిత్రం కనిపిస్తుంది. రూ. 200 రూపాయల నోటు వెనుక భాగంలో సాంచి స్థూపం కనిపిస్తుంది. ఇది మధ్యప్రదేశ్‌లోని విదిశా జిల్లాలో ఉంది. రూ. 100 నోటులో ‘రాణి కి వావ్’ చిత్రం ముద్రితమైవుంటుంది. ఇది గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో ఉన్న మెట్ల బావి. దీనిని సోలంకి రాజవంశానికి చెందిన రాణి ఉదయమతి తన భర్త భీమ్‌దేవ్- I జ్ఞాపకార్థం నిర్మించారు. ఇది 2014 సంవత్సరంలో యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు సంపాదించుకుంది.