CSK: సీఎస్‌కే ఢంకా మోగించింది.. థ్రిల్లింగ్ విన్ సాధించి ట్రోఫీ ఎగ‌రేసుకుపోయిన ధోని సేన‌

NQ Staff - October 16, 2021 / 07:54 AM IST

CSK: సీఎస్‌కే ఢంకా మోగించింది.. థ్రిల్లింగ్ విన్ సాధించి ట్రోఫీ ఎగ‌రేసుకుపోయిన ధోని సేన‌

CSK: గ‌త ఏడాది ధోని సేన చెత్త ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌డంతో టీంతో పాటు ధోనిపై కూడా అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. టీం పని అయిపోయింద‌ని ప‌లువురు కామెంట్ చేశారు. కాని ఐపీఎల్‌-14లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ ఛాంపియ‌న్‌గా నిలిచింది. దుబాయి వేదిక‌గా శుక్ర‌వారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ను 27 ప‌రుగుల తేడాతో ఓడించింది. నాలుగో సారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది.

CSK wins fourth IPL title

CSK wins fourth IPL title

ధోని సారథ్యంలో తమకు తిరుగులేదని నిరూపిస్తూ తుదిపోరులో ప్రత్యర్థిని మట్టికరిపించింది. దీంతో చెన్నై అభిమానుల ముఖాల్లో చిరునవ్వు విరిసింది. విజయ దశమినాడు విజిల్‌ పొడూ అంటూ ఫ్యాన్స్‌ సందడి చేస్తున్నారు. ఇక విజయానంతరం ధోని సేన చేసుకున్న సంబరాలకు సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

ఫైన‌ల్‌లో మొద‌ట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే ఓపెన‌ర్లు డుప్లెసిస్ (86), రుతురాజ్ గైక్వాడ్ (32) శుభారంభం చేశారు. గైక్వాడ్ ఔటైన త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన రాబిన్ ఉత‌ప్ప (31) ఫ‌ర్వాలేద‌నిపించాడు. గైక్వాడ్‌, ఉత‌ప్ప ఔటైన‌ప్ప‌టికీ డుప్లెసిస్ చెల‌రేగి ఆడాడు. ఫాస్ట్‌గా హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. ఉత‌ప్ప త‌ర్వాత వ‌చ్చిన మొయిన్ అలీ (37) కూడా దూకుడుగా ఆడాడు. దీంతో చెన్నై భారీ స్కోర్‌ను సాధించింది. నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 3 వికెట్ల న‌ష్టానికి చెన్నై 192 ప‌రుగులు చేసింది.

193 ప‌రుగుల ల‌క్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన కోల్‌క‌తా దూకుడుగా ఇన్నింగ్స్ మొద‌లుపెట్టారు. ఓపెన‌ర్లు వెంక‌టేశ్ అయ్య‌ర్ (50 ), శుభ్‌మ‌న్ గిల్ (51) ధాటిగా ఆడారు. చెరో హాఫ్ సెంచ‌రీతో మెరిశారు. కానీ వెంక‌టేశ్ అయ్య‌ర్ ఔట‌య్యాక‌ కోల్‌క‌తాకు వ‌రుస షాకులు త‌గిలాయి. చెన్నై బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో.. కోల్‌క‌తా ఆట‌గాళ్లు చ‌తికిల‌ప‌డ్డారు. దినేశ్ కార్తిక్ (9), ష‌కీబ్ (0), రాహుల్ త్రిపాఠి (2), మోర్గాన్ (4) ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసేసరికి కోల్‌క‌తా 9 వికెట్ల న‌ష్టానికి ప‌రుగులు మాత్రమే చేసి.. టార్గెట్‌ను చేధించ‌డంలో విఫ‌ల‌మైంది. దీంతో క‌ప్ ధోని సేన చేతికి చిక్కింది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us