ఐపీఎల్ : నేడే చెన్నై,డిల్లీ మధ్య బిగ్ వార్
Admin - September 25, 2020 / 12:40 PM IST

ఐపీఎల్ 2020 లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు జరగనుంది. ఈ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఇది రెండవ మ్యాచ్. అయితే పంజాబ్ తో మొదటి మ్యాచ్ ఆడిన ఢిల్లీ ఆ మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్‌తో నేడు ఆడనుంది. ఇక మెుదటి మ్యాచ్ లో కొనసాగించిన జోష్ తోనే ముందుకు వెళ్ళాలని ఢిల్లీ భావిస్తుంది.
ఇక చెన్నై జట్టు విషయానికి వెళ్తే రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి చెంది షాక్ లో ఉన్న ఆ జట్టు ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి మళ్లీ విజయ బాటలో నడవాలని భావిస్తుంది. ఇక రెండు జట్లు కూడా హోరాహోరీ పోరుకు సిద్ధం అయ్యాయి. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 21 సార్లు పోటీపడగా 15 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ గెలవగా, 6 సార్లు డిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. ఇక ఈరోజు జరిగే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే.