రాజీవ్ ఖేల్ రత్న రేసులో రోహిత్ శర్మ

Advertisement

క్రీడల్లో అత్యుత్తమ పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న. అయితే తాజాగా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ కమిటీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధానంగా దాంట్లో క్రికెటర్ రోహిత్ శర్మ, రెజ్లర్ వినేష్ ఫోగట్, టెబుల్ టెన్నిస్ ఛాంపియన్ మనికా బాత్రా, పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు పేర్లు ఆ జాబితాలో ఉన్నాయి. రాజీవ్ ఖేల్‌రత్న, అర్జున ఇతర క్రీడా అవార్డులకు నామినీలను ఎంపిక చేసేందుకు నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ కమిటీ మంగళవారం రోజున సమావేశం అయింది.

సమావేశం అనంతరం రాజీవ్ ఖేల్ రత్న నామినిలా పేర్లు ప్రకటించింది. కమిటీ ప్రతిపాదించిన ఈ పేర్లను కేంద్ర క్రీడాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు అమోదించాల్సి ఉంది.ఇక ఆయన ఆమోదించిన తరువాత రాష్ట్రపతి అవార్డులు ఇవ్వనున్నాడు. ఒకవైపు ఈ జాబితాలో క్రికెటర్ రోహిత్ శర్మ పేరు కూడా ఉండడం తో క్రికెట్ అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. చూడాలి మరి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఎవరు సొంతం చేసుకుంటారో..

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here