T20 World Cup : పాక్ వర్సెస్ ఇంగ్లాండ్: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చూసేవారేరీ.?
NQ Staff - November 12, 2022 / 04:16 PM IST

T20 World Cup : ఆస్ట్రేలియాలో జరుగుతోన్న 2022 టీ20 వరల్డ్ కప్ పోటీలకు సంబంధించి ఫైనల్ మ్యాచ్ పట్ల ఎవరికీ పెద్దగా ఆసక్తి లేకుండా పోయింది. ఎప్పుడైతే టీమిండియా ఈ టోర్నీ నుంచి సెమీస్ దశలో నిష్క్రమించిందో, అప్పుడే టోర్నీ మీద క్రికెట్ అభిమానులకి ఆసక్తి పోయింది.
ఈ టోర్నీ మొత్తంలో టీమిండియా తలపడిన మ్యాచ్‌లకు మాత్రమే ఎక్కువగా క్రికెట్ అభిమానులు హాజరయ్యారు. మిగతా మ్యాచ్‌లన్నీ చప్పగానే సాగాయి. ఆఖరికి ఆథిథ్య ఆస్ట్రేలియా జట్టు తలపడ్డ మ్యాచ్‌లకీ జనం పెద్దగా కనిపించ లేదు.
టీమిండియా ఔట్.. నిరాశలో భారత క్రికెట్ అభిమానులు..
ఫైనల్‌లో టీమిండియా ఆడుతుందని ఆశించిన భారత క్రికెట్ అభిమానులు, ముందే టిక్కెట్లను కొనుక్కున్నారు. వాళ్ళిప్పుడు, మ్యాచ్ చూసేందుకు ఆసక్తి ప్రదర్శించడంలేదు. టిక్కెట్లను సగం ధరకే వాళ్ళు అమ్మేస్తున్నారట. ఇంకొంత మంది టిక్కెట్లు వేస్ట్ అయినా ఫర్లేదు మ్యాచ్ మాత్రం చూడబోమని అంటున్నారట.
ఇంకోపక్క, టెలివిజన్ రేటింగ్స్ కూడా దారుణంగా వుండొచ్చన్న చర్చ జరుగుతోంది. స్టేడియం సగం నిండితే గొప్ప.. అని అంటున్నారు. మరీ ఇంత దారుణమైన పరిస్థితా.? అంటే, అవుననే చెప్పాలి.
చిత్రమేంటే, పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల్నీ, ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానుల్నీ ఈ మ్యాచ్ ఆకట్టుకునేలా కనిపించక పోవడం.