CPI Narayana: భార్య‌ను కూడా జ‌గ‌న్ తాక‌ట్టు పెట్టేస్తాడేమో.. నారాయ‌ణ సంచ‌ల‌న కామెంట్స్

CPI Narayana: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్నే కాదు భార్య‌ను కూడా తాకట్టు పెట్టేస్తాడేమో అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు, విద్యుత్ సంక్షోభం, డ్రగ్స్ మాఫియాపై మాట్లాడారు.

CPI Narayana Sensational Comments on AP CM YS Jagan

సీఎం సహకారంతోనే ఏపీలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందని, ప్రతి కాంట్రాక్టుకు ఐదు శాతం కమీషన్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుతోందని నారాయణ ఆరోపచారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కమీషన్లు తీసుకుంటున్నారని ఆధారాలతో నిరూపించేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఏపీలో వైసీపీ నేతల భూకబ్జాకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, భూకబ్జాకు పాల్పడే అధికార పార్టీ నేతలకు రెవెన్యూ సిబ్బంది సహకరిస్తున్నారని ఆయన తెలిపారు.

వైసీపీ నేతలకు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఖచ్చితంగా జైలుకు వెళ్ళే రోజు వస్తుందని నారాయణ హెచ్చరించారు. మోదీ చేతకాని పాలనతో దేశం మొత్తం అతలాకుతలమైందని, కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్ర రైతులపై కారు ఎక్కించి చంపేశారని, సీసీ కెమెరాల్లో కేంద్రమంత్రి కొడుకు అడ్డంగా దొరికితే ప్రధాని వెంటనే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలో జగనన్న చీకటి పథకానికి శ్రీకారం చుట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలు, డిస్కంల ప్రైవేటీకరణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు విద్యుత్ వినియోగం తగ్గించుకోవాలని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పటం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని రామకృష్ణ మండిపడ్డారు. కరెంట్ బిల్ తగ్గాలంటే లైట్లు, ఏసీలు ఆపమని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గెలుపును ఆపేయడం ఖాయమన్నారు.

ఐపీఎల్‌-2021 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌‌రైడర్స్‌తో బుధవారం జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో అశ్విన్ వరుస బంతుల్లో వికెట్లు తీసి ఢిల్లీ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. అయితే ఐదో బంతికి రాహుల్ త్రిపాఠి భారీ సిక్సర్ బాదడంతో కేకేఆర్ విజయం లాంఛనమైంది.

ఐపీఎల్ 2021 సీజన్‌లో అశ్విన్ దారుణంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌ల్లో కేవలం 7 వికెట్లు మాత్రమే తీసాడు. యూఏఈ వంటి టర్నింగ్ ట్రాక్‌లపై దారుణంగా విఫలమయ్యాడు.