CP CV Anand Responded On Panjagutta Pre Wedding : పంజాగుట్ట ప్రీవెడ్డింగ్ పై సీపీ సీవీ ఆనంద్ రియాక్ట్.. వార్నింగ్ ఇస్తూనే సపోర్ట్ చేసిన కమిషనర్..
NQ Staff - September 17, 2023 / 08:28 PM IST

CP CV Anand Responded On Panjagutta Pre Wedding :
పంజాగుట్ట పొలీస్‌స్టేషన్‌లో తీసిన ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పంజాగుట్ట పీఎస్ దేశంలోనే నెంబర్ వన్‌గా పేరు ప్రఖ్యాతలు గాంచిన విషయం తెలిసిందే.ఎన్నో సమస్యాత్మక కేసులను పరిష్కరించిన ఘనత ఈ స్టేషన్ పోలీసులకు దక్కింది. తాజాగా పంజాగుట్ట పీఎస్‌కు చెందిన పోలీస్ కపుల్స్ దిగిన ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్ అవ్వడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ వీడియోపై స్పందించారు.
పంజాగుట్ట పీఎస్‌లో భావన సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పనిచేస్తోంది.అదే స్టేషన్‌లో ఆర్ముడ్ రిజర్వ్ (AR) ఎస్సైగా పనిచేస్తున్న రావూరి కిషన్‌తో భావన కొంతకాలంగా ప్రేమలో ఉంది. వీరిరువురు పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే పెళ్లికి ముందు తీసుకునే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను వేదికగా చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

CP CV Anand Responded On Panjagutta Pre Wedding
పోలీస్ యూనిఫాంలోనే ఈ ప్రేమజంట ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకున్నారు.అందుకోసం పోలీసు వాహనాలను వాడుకున్నారు. వాస్తవానికి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఆగస్టు 26న జరగగా.. ఆలస్యంగా ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరేమో ఈ జంట అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కామెంట్స్ చేస్తుంటే మరికొందరు వారికి సపోర్టు చేస్తున్నారు.
తాజాగా దీనిపై నగర సీపీ సీవీ ఆనంద్ స్పందిస్తూ.. పెళ్లిపై పంజాగుట్ట స్టేషన్‌కు సంబంధించిన పోలీసు జంట కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళలకు పోలీస్ జాబ్ కష్టమైనది. డిపార్ట్మెంట్ వ్యక్తే తనకు భాగస్వామిగా రావడంతో ఆనందంతో సెలబ్రేట్ చేసుకున్నారు. పోలీసు వాహనాలను తప్పుగా అనిపించడం లేదు. కానీ ఉన్నతాధికారుల అనుమతి తీసుకుంటే బాగుండేది. వారు తనను పెళ్లికి పిలవకపోయినా వారిని కలిసి ఆశీర్వదిస్తా..ఇకపై అనుమతి లేకుండా ఎవరూ ఇలాంటివి చేయొద్దు అని సీపీ సూచించారు.