ఈ ఏడాది చివరి లోపు కరోనా వ్యాక్సిన్ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

Advertisement

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ దాటికి అతలాకుతలం అవుతుంది. ఇక మన దేశంలో సైతం కరోనా శరవేగంగా విస్తరిస్తుంది. ఒకవైపు ఈ వైరస్ ని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు అన్ని కూడా వ్యాక్సిన్ కోసం అహర్నిశలు కష్టపడుతున్నాయి. అయితే ఇప్పటికే రష్యా తమ దేశం నుండి వ్యాక్సిన్ ను విడుదల చేసింది. కానీ ఆ వ్యాక్సిన్ పై పలు అపోహలు వస్తున్నాయి. ఇక భారత్ లోను పలు ఫార్మా సంస్థలు వ్యాక్సిన్ తయారీలో బిజీగా ఉన్నాయి.

అయితే భారత్‌లో ఈ ఏడాది చివరిలోగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. దేశీయ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ రూపొందించిన కోవ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తయితే ఈ ఏడాది చివరి వరకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామని అన్నారు. అలాగే మరోవైపు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ అంతకన్నా ముందుగానే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

అయితే భారత్ బయోటెక్ తో పాటు జైడస్ కాడిలాకు చెందిన మరో వ్యాక్సిన్ కు కూడా ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అలాగే దేశంలో మొత్తం మూడు వ్యాక్సిన్లకు ట్రయల్స్ జరుగుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఆగష్టు 15 వ తేదీన చెప్పారు. అందువల్ల ఈ మూడు వ్యాక్సిన్లు వీలైనంత త్వరగా అందుబాటులోకి వస్తాయని అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here