కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేసిన రష్యా

Admin - August 11, 2020 / 10:33 AM IST

కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేసిన రష్యా

కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. అయితే ఈ వైరస్ ను అరికట్టడానికి ప్రపంచ దేశాలు అన్ని కూడా వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నాయి. కానీ అన్ని దేశాల కంటే రష్యా ఓ అడుగు ముందు ఉంది. తాజాగా కరోనా వైరస్‌కు రష్యా వ్యాక్సిన్‌ను కనుగొందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. అయితే రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం పలికిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వ్యాక్సిన్‌ను మొట్టమొదట సారిగా తన కూతురుకు ఉపయోగించినట్లు పుతిన్ తెలిపారు.

రష్యా దేశ రాజధానిలోని మాస్కోలోని గమలేయ ఇన్‌స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిందని అన్నారు. రెండు నెలల పాటు దశల వారీగా మనుషులపై ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయని పుతిన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాక్సిన్ గురించి అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. ఈ టీకా ద్వారా మనుషుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా నియంత్రణలో కీలకంగా పనిచేస్తుందని వివరించారు. మొదటగా వైద్య సిబ్బందికి మరియు ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ చేయనున్నట్లు ఆయన అన్నారు. ఈ వ్యాక్సిన్‌ను త్వరలోనే భారీగా ఉత్పత్తి చేసి అన్ని దేశాలకు దిగుమతి చేస్తామని అన్నాడు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us